వార్త : గాంధీ జయంతి రోజు నుంచి మద్యపాన నిషేధం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్టు తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా ప్రకటించారు.
చెవాకు : మద్యంపైనే కదా మీ పోరు. ఎందుకంటే నీ నాయకుడు ఇటీవలే కల్లు గీత కార్మికులకు మద్దతుగా ఓ సభలో మాట్లాడారు. మద్యం పేరుతో కల్లు కూడా నిషేధించాలంటే కల్లుగీత కార్మికులు చిర్రెత్తిపోగలరు.
ఔను ఎన్నికలు దగ్గర పడుతున్నాయిగా. ఈ సమయంలో ఈ ఉద్యమాన్ని నెత్తికెత్తుకుంటే మంచిదేనంటారా. మీ నేత గతంలోలా సంస్కరణల జపం పక్కనబెట్టి సంక్షేమం జపం చేస్తున్న తరుణంలో మీరు ఆయనను ఇరుకున పెట్టేస్తారేమో.
ఒకవేళ మీ నేత అధికారంలోకి వస్తే మరి ఆ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయగలరు? అన్ని వర్గాలనూ ఆకర్షించేలా ఇప్పటికే వరాల జల్లు కురిపించేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయ రాబడి తెచ్చిపెడుతున్న మద్యం విక్రయాలను నియంత్రిస్తే మరి ఈ హామీలను ఎలా అమలు చేయగలరో కాస్త శెలవిస్తే మంచిది.