Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలుపు తలుపుకీ పిలుపు

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2007 (16:51 IST)
PTI
సెక్రటరి: " అమాత్యులవారికి జయము... జయము!! మీ ఆనతి మేర మన అనుచరగణం దేశం నలుమూలలా శోధించి కొన్ని వినూత్న ప్రచార విధానములను తెలుసుకొని వచ్చిరి. మీరు అంగీకరించిన యెడల వాటిని మీ ముందు ఉంచెదము" -అన్నాడు పాశ్వాన్ వారి సెక్రటరి

పాశ్వాన్: ఏవిటా పద్ధతులు... వెనువెంటనే విశదపరచండి....

సెక్రటరి: నేటి ఆధునిక పద్ధతి అయిన ఆల్ఫా బెటికల్ ప్రకారం... ముందుగా మీకు ఆంధ్రదేశమున అనుసరించే విధానములను వివరించెదము. వై.ఎస్ రాజశేఖర రెడ్డివారు పదవిని చేపట్టక ముందు పాదయాత్రను చేసి అనూహ్యమైన విజయాన్ని కైవసం చేసుకొని యున్నారు. అలాగే ... ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వారు 'ప్రజలతో ముఖ్యమంత్రి' పేరిట దూరదర్శినిలో ప్రజల సమస్యలపై ప్రత్యక్ష ప్రసారం గావించి విశేషంగా ఆకట్టుకున్నారు. ఇహ సింహ‌గర్జన, మహా‌గర్జన... వంటి 'గర్జన' సభలైతే కోకొల్లలు. ఆ తర్వాత అరుణాచల ప్రదేశము విషయానికి వస్తే....

పాశ్వాన్: సమయం మించి పోతున్నది. మీ ప్రసంగాన్ని ఆపి, పాటలీ పుత్రంలో నేను తలపెట్టవలసిన ప్రణాళిక ఏమిటో తక్షణం తెలుపండి.

సెక్రటరి- అధికారులు: ???????????
పాశ్వాన్: ఏవిటీ...? ఎవరూ చెప్పలేరా?.... అని తల పంకించి...
అధికారులారా.. అందుకోండి... ఆ మృదంగాన్ని!
అనుచరులారా... తరలిరండి... నా వెంట!! అంటూ మృదంగాన్ని తీసుకుని మెడలో వేసుకుని 'సంకల్ప్' పేరిట 'తలుపు తలుపుకీ పిలుపు' అన్న నినాదంతో వెడలెన్ పాశ్వాన్‌జీ.

గమనిక: ఇది కేవలం ఊహాజనిత కథనం మాత్రమే... ఎవరినీ కించపరచటమో.. అపహాస్యం చేయటం మా ఉద్దేశ్యం కాదని గమనించగలరు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments