Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను పట్టిన ఏలినాటి శని తొలిగిపోయిందట..!

Webdunia
FILE
తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల్లో కలిసిరాకపోవడం, ఆ పార్టీ అధ్యక్షుడు అవమానాలు, ఆరోపణలకు గురికావడం వంటి కార్యాలకు ఏలినాటి శనే కారణమని ఊహాగానాలు వస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తనకు ఏలినాటి పట్టిందని కేసీఆరే స్వయంగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ శని సెప్టెంబర్ తొమ్మిదో తేదీ రాత్రి 10.33 గంటలతో ఏలినాటి తొలగిపోయిందని, అలాగే పార్టీని పట్టిన అష్టమాదశ శని కూడా పోయిందని ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ స్వయంగా పేర్కొన్నట్లు సమాచారం.

ఇకపై తన జాతకంతో పాటు, పార్టీ జాతకం కూడా బాగుంటుందని, తెలంగాణా ఉద్యమాన్ని ఢిల్లీని ప్రభావితం చేసేలా కార్యాచరణ చేయాలని పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినాన్ని సీరియస్‌గా జరపాలని, ప్రజల్లో తెలంగాణపై భక్తిని మరింత పెంచాలని కేసీఆర్ అన్నారు.

మొత్తానికి ఇకపై తెరాసకు మంచి రోజులేనని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన ఆత్మశాంతి కోసం చెప్పుకుంటున్నారా? లేదా.. నిజంగానే ఆయనకు పట్టిన శని తొలగిపోయిందా? అనే విషయాన్ని చెప్పేందుకు మనమేమీ జ్యోతిష్యులం కాము. కానీ కేసీఆర్, తెరాస పార్టీ భవితవ్యంపై మీ అభిప్రాయాలేమిటో? చెప్పండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments