Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నవ్వులు కోసమే...

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2007 (21:20 IST)
WD PhotoWD
యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు
ప్రపంచంలో నవ్వగలిగే ఏకైక జీవి మనిషి. సృష్టిలో కోటానుకోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ కేవలం మనిషికి మాత్రమే నవ్వగలిగే శక్తిని ప్రసాదించింది ప్రకృతి. నవ్వు మనిషికి ఎంతో మంచి చేస్తుంది. నవ్వినప్పుడు ముఖ కండరాలన్నీ కదులుతాయి. అంతేకాదు... ఛాతీ ఉదర, కండరాలకు వ్యాయామం చేకూరుతుంది.

ఇంతటి విలువైన నవ్వుకు మనిషి ఎందుకో దూరమవుతున్నాడు. రోజుకు కనీసం 18 నిమిషాలపాటు మనిషి నవ్వేవాడు. అయితే ఇది ప్రస్తుత పరిస్థితి కాదు. 1950ల కు ముందుమాట. మరి నేటి పరిస్థితి ఏమిట ీ... అంటే.... కేవలం ఆరంటే ఆరు నిమిషాలకు మించి మనిషి నవ్వటం లేదని పలు పరిశోధనలు చెపుతున్నాయి.

పెద్దల్లో ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈ ప్రభావం పిల్లలపైనా పడుతోందని వారు చెపుతున్నారు. ఇదివరకు పిల్లలు రోజులో కనీసం నాలుగు వందల సార్లు నవ్వేవారు. ఇప్పుడా అందాల నవ్వులు రోజుకు కేవలం 60 నుండి 70కి పడిపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
WD PhotoWD


గత ఆరు దశాబ్దాలుగా తగ్గుతూ వస్తున్న ఈ నవ్వుకు మనిషి అనారోగ్యానికి సంబంధం ఉన్నది. నేడు ప్రజలలో అత్యధికంగా కనిపిస్తున్న అనారోగ్య సమస్యలకు నవ్వకపోవటమే కారణమవుతోంది.

ఆదుర్దా, గుండె జబ్బులు, నిద్రలేమి తదితర ఎన్నో రకాల ఇబ్బందులు కేవలం మనసారా నవ్వకపోవటం కలుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నేడు మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్తరోగాలకు దివ్యౌషధం ఒక్క నవ్వేనంటున్నారు.

WD PhotoWD
ఫలితంగానే చాలా చోట్ల హాస్యయోగా చికిత్సా కేంద్రాలు పలుచోట్ల మహా జోరుగా సాగుతున్నాయి. అసలు మనిషి ప్రతిరోజూ కనీసం పదిహేను నిమిషాలైనా నవ్వగలిగితే ఏ సమస్యా దరిచేరదంటున్నారు. కనుక ఈ నవ్వును ఉదయం లేవగానే సాధన చేయగలిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయంటున్నారు నిపుణులు.

అయితే ఈ నవ్వుల్లోనూ రకరకాల నవ్వులున్నాయి. ఇతరులను చూసి నవ్వేది మొదటి తరహా నవ్వు. అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండా వచ్చేటటువంటి నవ్వు ఇది. అయితే ఇందులో వ్యతిరేక భావాలు అధికంగా కనిపిస్తాయి.

ఇటువంటి నవ్వులు ఒక్కోసారి ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడతాయి. ఉదాహరణకు మహాభారతంలో ద్రౌపది నవ్వు ఇటువంటిదే. మయసభలో దుర్యోధనుడి అవస్థ చూసిన ద్రౌపదికి నవ్వాగక పోవటంతో అతనిలో ద్రౌపది పట్ల వ్యతిరేక భావనలు పెరిగిపోయాయి.
WD PhotoWD


ఇక రెండోది ఎవరిమీద వారే జోకులు పేల్చుకుని నవ్వుకోవటం. ఇది అన్ని వేళలా శుభప్రదం. మూడో తరహా మనసులోనుంచి పెల్లుబికి వస్తుంది. ఇది అత్యంత ఆరోగ్యకరమైన నవ్వు. తరతరాలకు తగ్గుతూ వస్తున్న ఈ నవ్వును మనసారా పూయిద్దాం. తనివితీరా నవ్వుకుందాం

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments