వార్త : గతంలో టీడీపీ కాదన్నుందునే తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలేకపోయామని బీజేపీ సీనియర్ నేత అద్వానీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమం సందర్భంగా అన్నారు.
చెవాకు : అయితే టీడీపీతో ఇక భవిష్యత్తులో పొత్తు పెట్టుకోరన్నమాట. ఇప్పటికిపుడు తెలంగాణపై ఏమీ తేల్చకనే మీతో పొత్తుకోసం చంద్రబాబు వచ్చినా మీరు కాదంటారనే కదా దీని అర్థం.
మిత్రధర్మకోసం ప్రజాభీష్టాన్ని సైతం ఆ రోజు తుంగలో తొక్కినా నేడు మాత్రం ప్రజల అభిప్రాయానికి అత్యంత అధికంగా విలువకట్టడంలో ఆంతర్యమేమిటో మీకే తెలియాలి.
ఇపుడు మీరు వేసే ఎత్తుగడతో తెరాస, నవతెలంగాణ, తల్లి తెలంగాణ వంటి తెలంగాణ అనుకూల పార్టీలన్నీ మీ చెంతకు వస్తాయనుకుంటున్నారా? అందరూ లాభ, నష్టాలు బేరీజు వేస్తున్నవారే కాబట్టి రాజధాని తప్ప మరెక్కడా మీ బలం లేదని తెలిసి కూడా మీతో వారు వస్తారనుకోవడం భ్రమ కాకుంటే మరేమిటి?