Webdunia - Bharat's app for daily news and videos

Install App

చూచితివా చవాన్...? మా ఉసురు మిమ్ములను వెంటాడుచున్నది

Webdunia
ఏంటీ.. శనివారం ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరు కూడా కనబడటం లేదు. అసలేం జరుగుతోందని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వైపుకి వెళితే... ఇదీ సంగతి...

సెక్రటరీ: " మాజీ అమాత్యులవారికి జయము.. జయము!! మీరు బాబ్లీ సందర్శనకు వెళ్లిన సమయములో అక్కడ రక్షక భటులచే మిమ్మల్ని చెరబట్టి కుళ్లబొడిచిన మహారాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు తగిన ప్రాయశ్చిత్తము జరుగుతున్నదన్న వార్తలు నా దృష్టికి వచ్చినవి. మీరు అంగీకరించిన యెడల ఇప్పుడే ఆ దూరవాణి తెరపై ఆ దృశ్యములను మీముందు ప్రవేశపెట్టెదను.

మాజీ అమాత్యులు: ప్రవేశపెట్టుడు.

దూరవాణి తెరలో... నేనేమి చేసితినో నాకేమీ బోధపడుట లేదు. ఆకస్మికముగా నా కిరీటము గాలిలో ఎగిరిపోవుట కాంచితిని. అది ఒక్క దినమే కదా అని అనుకుంటిని. కానీ ఈ దుస్స్వప్నము కనులు మూసిన చాలు కళ్లెదుటే నిలుస్తున్నది. కుర్చీలో కూర్చున్నంతనే కుళ్లబొడుస్తున్న ఈ క్షోభను భరించలేని నేను నా రాజీనామా పత్రమును మా అధినాయకురాలికి ఇచ్చితిని.

ఎటులనూ... కిరీటము ధరించిన నేను... నాకు నేనుగా కుర్చీలో నుంచి లేచి వెళ్లలేను. గనుక నన్ను కుర్చీ నుంచి లేపే అధికారాన్ని మా అధినాయకురాలువారికి ఇచ్చి వచ్చుతుంటిని.. అంటూ చవాన్ మాటలు. ఇంతలో... వార్తావాచకుడు ప్రత్యక్షమై... మరిన్ని వివరములు తెలుసుకునేముందు ఇపుడో స్వల్ప విరామము.. ఆపై ఓ ప్రకటన...

మాజీ అమాత్యులు: సెక్రటరీ.. మిగిలిన మన మాజీఅమాత్యుల వారికినీ... ద్వితీయశ్రేణి నాయకులకును, తృతీయ.. చతుర్థ.. ఇలా అన్ని శ్రేణుల నాయకులకును ఈ శుభవార్త చెప్పుడు. వెంటనే నా సహమాజీలను లోనికి ప్రవేశపెట్టుడు.

సెక్రటరీ: చిత్తం ప్రభూ...
మాజీ అమాత్యులు: (సహమాజీలతో) చూచితిరా. కండకావరమున నాడు మనపై చేయి చేసుకున్న చవాన్ గతి ఏమైనదో. మానమర్యాదలు మరచి ప్రవర్తించిన ప్రతివానికి దేవుడు విధించు శిక్ష ఇటులనే ఉండగలదు. భవిష్యత్తులో మన నాయకులపై దాడి చేయు సాహసము మరెవరూ చేయరు. చేయలేరు. ఈ చవాన్ గుణపాఠము అందిరికీ కనువిప్పు కాగలదు.

ఇంతటితో ఈ సభను ముగించుచున్నాను. రేపటి సూక్ష్మరుణ వ్యతిరేక ఆందోళనపై మనమందరము ముందుకు పోవుదము. శెలవు.

గమనిక: ఇది కేవలం కల్పిత కథనం మాత్రమే... ఎవరినీ కించపరచటమో.. అపహాస్యం చేయటం మా ఉద్దేశ్యం కాదని గమనించగలరు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments