Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిలో రంగ హరీ.. "నువ్వుల అరిసెలు" తిందాం రండి..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం నానబెట్టి తయారుచేసిన పిండి.. అరకేజీ
బెల్లం... తీపి కావాల్సినంత
నువ్వులు.. సరిపడా
నెయ్యి... అరకేజీ

తయారీ విధానం :
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో తగినంత బెల్లంవేసి బాగా సన్నటి మంటపై ముదురుపాకం పట్టుకోవాలి. ప్లేటులో నీల్లు తీసుకుని అందులో కొద్దిగా పాకం వేస్తే, అది దగ్గరగా గట్టిపడి శబ్దం వచ్చినట్లయితే పాకం సిద్ధమైందని అర్థం చేసుకోవాలి.

అలా వచ్చిన పాకంలో కొద్దిగా నెయ్యి, వేయించి శుభ్రంచేసి పెట్టుకున్న నువ్వులు, సరిపడా బియ్యంపిండి వేసి కలపాలి. ఆ మిశ్రమం ఉండ చేసేందుకు వీలుగా వచ్చేంతదాకా బాగా కలపాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.

వాటిని పలుచగా అరిసెల్లాగా వత్తి బాణలిలో కాగుతున్న నెయ్యిలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. వేయించిన వాటిని చిల్లులున్న గరిటెతో బాగా వత్తినట్లయితే నెయ్యి అంతా బయటికి వచ్చేస్తుంది. అలా మొత్తం ఉండలను ఒత్తుకుని నేతిలో వేయించి తీసేస్తే ఘుమఘుమలాడే నువ్వుల అరిసెలు సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

లేటెస్ట్

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

Baba Vanga Predictions: బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?

మీనరాశి ఉద్యోగ జాతకం 2025.. చన్నా దాల్, పసుపు ఆవాలు..?

ధనుస్సు 2025 జాతకం.. కుటుంబ సౌఖ్యం.. మంచంపై నెమలి ఈకలు

Show comments