Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి శాస్త్రపరంగా ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

Webdunia
FILE
సంక్రాంతికి శాస్త్రపరంగా ప్రత్యేకత ఉంది. నక్షత్రాలు ఇరవై ఏడు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరించబడుతుంది.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఒకరు శక్తి మరొకరు పదార్థము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కర్కాట సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి. వరుణుడు పడమరకు అధిపతి. వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము.

సూర్యుడు ధనుర్రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు దేవతలకు పగలుగా ఉంటుంది. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించింది మొదలు ధనురాశిలో ప్రవేశించేవరకు దేవతలకు రాత్రి. ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది.

కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి.. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

లేటెస్ట్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

24-11-2014 ఆదివారం వారం ఫలితాలు : కీలక పత్రాలు జాగ్రత్త.. మీ జోక్యం అనివార్యం...

24-11-2004 నుంచి 30-11-2024 వరకు మీ వార ఫలితాలు

23-11-2024 శనివారం ఫలితాలు - శ్రమాధిక్యతతో లక్ష్యం సాధిస్తారు...

Show comments