సంక్రాంతికి పచ్చకర్పూరం, కొత్త బియ్యంతో పొంగలి చేసుకోండి.

Webdunia
సంక్రాంతికి పచ్చకర్పూరం, కొత్త బియ్యంతో పొంగలి చేసుకోండి. పెద్ద పండుగైన సంక్రాంతి రోజున బంధువులు, స్నేహితులకు తీపిపదార్థాలు పంచుకుంటుంటారు. తరచూ కొత్త బియ్యంతో చక్కెర పొంగలి కాకుండా ఈసారి పచ్చకర్పూరంతో చక్కెర పొంగలి తయారు చేయండి.

కావలసిన పదార్థాలు :
బియ్యం.. ఒక కేజీ
ఎండుకొబ్బరి ముక్కలు.. ఒక కప్పు
పెసరపప్పు.. ఒక కప్పు
జీడిపప్పు.. 50 గ్రా.
పంచదార.. 300 గ్రా.
కిస్‌మిస్.. 50 గ్రా.
నెయ్యి.. 150 గ్రా.
పచ్చ కర్పూరం.. 2 గ్రా.

తయారీ విధానం :
బియ్యం, పెసరపప్పులను ముందుగానే ఉడికించి పక్కనుంచాలి. ఓ పాత్రలో నెయ్యి వేసి వేడయిన తరువాత కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి రెండు నిమిషాలపాటు కలియదిప్పుతూ వేయించాలి. ముందుగా ఉడికించుకున్న అన్నం, పెసరపప్పు మిశ్రమాన్ని జతచేయాలి. పంచదార కలిపి బాగా కలియబెట్టి పచ్చకర్పూరం కూడా వేసి కలిపి దించేయాలి. అంతే చక్కెర పొంగలి సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆయన అద్భుతంరా బుజ్జీ: డిప్యూటీ సీఎం పవన్ దాతృత్వంపై ప్రశంసలు

మోడీజీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి: అండర్ వరల్డ్ డాన్ కుమార్తె హసీన్ వీడియో ద్వారా విజ్ఞప్తి

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లుకు బ్రేక్.. సంబరాలు చేసుకుంటున్న వైకాపా

అన్నీ చూడండి

లేటెస్ట్

Guruvar Vrat: బృహస్పతిని గురువారం పూజిస్తే నవగ్రహ దోషాలు మటాష్

11-12-2025 గురువారం ఫలితాలు - జూదాలు.. బెట్టింగులకు పాల్పడవద్దు...

10-12-2025 బుధవారం ఫలితాలు - నగదు స్వీకరణ.. చెల్లింపుల్లో జాగ్రత్త...

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్

09-12-2025 మంగళవారం ఫలితాలు - ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు...

Show comments