ఆమెతో గడిపిన ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా... ఆమె ఎందుకలా చేస్తుందీ...?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (16:43 IST)
గత ఏడాదిగా ఓ అమ్మాయితో నాకు పరిచయం ఉంది. మేమిద్దరం యూనివర్శిటీలో చదువుతున్నాం. నాకు ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్ లేరు. యూనివర్శిటీకి వచ్చాక అనుకోకుండా ఈమెతో పరిచయం ఏర్పడింది. ఇక అప్పట్నుంచీ మా పేరెంట్సుతోనైనా మాట్లాడకుండా ఉన్నానేమో కానీ ఆమెతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా లేను. అంతగా ఆమెతో ఎట్రాక్ట్ అయిపోయాను. ఇద్దరం సినిమాలకు, సాయంత్రం వేళల్లో పబ్బులకూ వెళ్లాము కూడా. ఇలా ఆమె-నేను చాలా క్లోజ్ అయిపోయాం. ఈమధ్య హఠాత్తుగా ఆమె బాంబులాంటి వార్త చెప్పింది. 
 
తను ఓ యువకుడితో ప్రేమలో పడిందట. అతడిని పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. అదేంటి.. నేను నిన్ను చేసుకోవాలనుకున్నాను. నువ్వు-నేను చాలా క్లోజయ్యాం కదా అని అడిగితే... నేనలా ఎప్పుడూ భావించలేదని చెప్పి వెళ్లిపోయింది. అదేరోజు రాత్రి... కోపమొచ్చిందా అంటూ లాలనగా మాట్లాడింది. మనిద్దరి స్నేహం ఇలాగే ఉండాలి. ఎప్పటికీ ఒకరికొకరు మర్చిపోకూడదంటూ చెప్తోంది. ఆమె నాకు అర్థం కావడంలేదు. నన్నెందుకు వద్దనుకుని వేరేవాడిని పెళ్లాడాలనుకుంటుంది...?
 
ఆమే చెప్పింది కదా... మిమ్మల్ని ఆ భావనలో చూడలేదని. అలాగే మీరు కూడా ఆమె వేరే యువకుడిని ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటానని చెప్పేవరకూ మీ మనసులో ఉన్నదేమిటో చెప్పలేదు కదా. అందువల్ల మీరు తన పట్ల స్నేహపూర్వకంగా మాత్రమే ఉంటున్నారని అనుకుని ఉండవచ్చు. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది. ఆమె అనుకుంటున్నట్లే మీరు మంచి స్నేహితుడిగా ఉండిపోవడం మంచిది. ఇక మధుర జ్ఞాపకాలంటూ ఆమెతో కలిసి వెళ్లిన సమయాలను గుర్తు చేసుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచ దేశాలతో ట్రంప్ గిల్లికజ్జాలు, గ్రీన్‌ల్యాండ్‌ను కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్

మకర సంక్రాంతికి బస్ బుకింగ్‌లలో 65 శాతం జంప్‌, రెడ్‌బస్ కోసం ఎగబడ్డ ఏపీ, తెలంగాణ ప్రయాణికులు

సంక్రాంతికి వస్తున్నాం: చంద్రబాబు, పవన్, జగన్, కేసీఆర్, కేటీఆర్, రేవంత్ (video)

Nipah Virus: పశ్చిమ బెంగాల్‌లో రెండు నిపా వైరస్ కేసులు.. ఇద్దరు నర్సులకు పాజిటివ్?

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీకే చెప్పేది, మా ఇద్దర్నీ వీడియో తీయొద్దు: ఫోటోగ్రాఫర్లపై కృతి సనన్ ఆగ్రహం

Maruti: రాజా సాబ్ గా ప్రభాస్ ని కొత్తగా చూపించాననే ప్రశంసలు వస్తున్నాయి : మారుతి

సుమతీ శతకం నుండి అమర్దీప్ చౌదరి డాన్స్ తో తొలి సాంగ్ రిలీజ్

Naveen : అనగనగా ఒక రాజ సంక్రాంతి పండుగలా ఉంటుంది: నవీన్‌ పొలిశెట్టి

అస్సామీ చిత్రం జూయిఫూల్ ఉత్తమ చలనచిత్ర అవార్డు; దర్శకుడిగా రాజేష్ టచ్‌రివర్

Show comments