Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం... ఓ మధురమైన రాత్రిగా మిగిలిపోవాలంటే..!!

Webdunia
గురువారం, 31 జనవరి 2013 (16:22 IST)
File
FILE
యువతి జీవితంలో వెయ్యి రాత్రులు రావొచ్చు కానీ.. ఫస్ట్ నైట్ (శోభనం) అనేది ఆ యువతి జీవితంలో మరువలేని రాత్రి. అలాంటి మధురమైన రాత్రిని అనుభవించే ముందు అనేక మంది యువతులు తీవ్ర ఒత్తిడికి, టెన్షన్‌కు గురవుతుంటారు. ఇలాంటి యువతులు ఎలాంటి ఒత్తిడి.. టెన్షన్ లేకుండా హాయిగా శోభనం రాత్రిని మస్తు మజా చేసేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో..

వివాహం ముగిసిన తర్వాత శోభనం ఎక్కడ జరగబోతుందో ఎలాంటి సంకోచం.. బిడియం లేకుండా భర్తను అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే.. కొత్త ప్రాంతం, కొత్త స్థలంలో ఇలాంటి రాత్రిని పూర్తిగా ఆస్వాదించలేరు. కారణం.. కొత్త ప్రాంతమనే ఆందోళన. అందుకే.. శోభనం జరిగే స్థలం, ప్రాంతాన్ని ముందుగానే తెలుసుకోవడం వల్ల మానసికంగా సిద్ధం కావచ్చు.

వివాహానికి ముందే సెక్స్ గురించి స్నేహితుల ద్వారా లేదా అశ్లీల పుస్తకాలు చదివి తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అవసరమైతే ఓ మంచి సెక్స్ నిపుణుడిని సంప్రదించి సెక్స్‌పై తమకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. ముఖ్యంగా.. ఫస్ట్ నైట్‌ రోజునే నెలసరి రాకుండా వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

శోభనం రోజు రాత్రి మిత ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా.. ఎక్కువ మసాలాదినుస్సులు వేసిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండటమే ఎంతో మేలు. శోభనం గదిలోకి వెళ్లే ముందు స్నానం చేయాలి. అలా స్నానం చేసేందుకు వీలు పడకపోతే.. ఉదయం నుంచి వేసుకున్న డ్రెస్‌లను తొలగించి.. కొత్త డ్రెస్‌లను ధరించి, అందంగా అలంకరించుకుని, సువాసనలు వెదజల్లే అత్తర్లు స్ప్రే చేసుకోవాలి. అలాగే, బెడ్‌ మంచంపై కూర్చొనే ముందు.. ఒకటికి రెండుసార్లు మంచాన్ని చెక్ చేసుకోవాలి.

యువతికి పురుషుని తొలి స్పర్శ అనేది ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే. శోభనం గదిలో భర్త చేసే చిలిపి చేష్టలు ఒక విధంగా ధర్మసంకటంగా మారుతాయి. అలాంటి సమయంలో ఏమాత్రం సంకోచం లేకుండా నిర్మొహమాటంగా భర్తకు చెప్పొచ్చు. అలాగే, శోభనం రాత్రే సెక్స్‌లో పాల్గొనాలన్న నియమ నిబంధన లేదన్న అభిప్రాయానికి భార్యాభర్తలు వచ్చినట్టయితే, శోభనం రోజున కలిగే అన్ని రకాల భయాందోళనలు మీ నుంచి దూరమైనట్టేనని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.

అలాగే, పూర్వరతి కార్యక్రమం ముగిసిన వెంటనే.. సెక్స్‌లో పాల్గొనేందుకు ఆత్రుత పడాల్సిన అవసరం లేదు. తొలిసారి అంగ ప్రవేశం జరిగే సమయంలో యోని కండరాలు నొప్పి కలిగిస్తాయి. అలాంటి సమయంలో పురుషుడు తన అంగానికి పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరి నూనెను రాసి సెక్స్‌లో పాల్గొన్నట్టయితే భార్యకు నొప్పి లేకుండా చేసినట్టవుతుంది. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలు పాటించినట్టయితే కొత్త దంపతుకు శోభనం రాత్రి వారి జీవితంలో ఓ మధురానుభూతిగా మిగిలిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

'ఫెంగాల్' : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్