Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరాల స్పర్శ కాదు ప్రేమంటే

Webdunia
మంగళవారం, 29 జులై 2008 (16:59 IST)
కాలం ఆధునికంగా మారినట్టే ప్రేమ సైతం ప్రస్తుత కాలంలో ఆధునికత సంతరించుకుంది. ఒకప్పుడు ప్రేమంటే ఉన్న భావం, అర్ధం అన్నీ ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయి. జీవనంలోనూ, జీవితంలోనూ వేగం పెరిగిపోయాక మనుషికి సంబంధించిన ఆలోచనలు, భావాల్లో సైతం పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ కోవలో ప్రేమ అనే భావానికి సైతం మనిషి పూర్తిగా అర్థం మార్చేశాడు. ప్రేమ అనేది మనసులు కలిసే ప్రక్రియ అనే దశ దాటి ప్రేమ పేరుతో శరీరాలను ఏకం చేసే దుస్సాంప్రదాయం నేటి కాలంలో చోటు చేసుకుంది. ఒకప్పుడు ప్రేమ పేరుతో హద్దులు దాటేవారి సంఖ్య పరిమితంగా ఉంటే నేటికాలంలో మాత్రం ప్రేమ పేరుతో హద్దులు దాటనివారి సంఖ్య పరిమితంగా ఉండడం విశేషం.
ఈ తరం ప్రేమ అంతే బాసూ...
  నేటికాలంలో చాలామంది దృష్టిలో ప్రేమ కూడా వ్యాపార లావాదేవీగా మారిపోయింది. తమ అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రేమను ఓ సాధనంగా ఉపయోగిస్తున్నారు.       


కొన్నాళ్ల క్రితం వరకు ఒకరిని చూచి తమ మనసులో కలిగిన ఆకర్షణ, ఇష్టాన్ని ప్రేమగా భావించి దాన్ని జీవితాంతం కాపాడుకోవడానికి ప్రయత్నించేవారు. అలాగే ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ అనే బంధం కొనసాగుతున్నా పెళ్లి అయ్యే వరకు సమాజం విధించిన కట్టుబాట్లను దాటకుండా ఉండేందుకు వారు ప్రయత్నించేవారు.

కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనసులో కలిగింది ఇష్టమో లేక వ్యామోహమో కూడా తెలియక ముందే దానికి ప్రేమ అనే పేరు పెట్టేసి యవ్వనం అయినా దాటకముందే అబ్బాయి, అమ్మాయిలు హద్దులు దాటడానికి సిద్ధమైపోతున్నారు. అంతేకాకుండా వారు చేసే ఆ పనికిమాలిన పనులకు నాగరికత, ప్రపంచీకరణ, స్వేచ్ఛ అనే పేర్లు పెట్టుకుని వారిని వారే మోసం చేసుకోవడం కాకుండా మరికొందరు తమలా తయారయ్యేందుకు సైతం కారణమవుతున్నారు.


అయితే ఈ విషయంలో కేవలం యువతను మాత్రమే నిందించాల్సిన పనిలేదు. చుట్టూ ఉన్న వాతావరణం, కళ్లముందు కన్పించే కొన్ని అంశాలు వారు అలాంటి పనులు చేయడానికి దోహదం అవుతున్నాయి. అందుకే నేటికాలంలో చాలామంది దృష్టిలో ప్రేమ కూడా వ్యాపార లావాదేవీగా మారిపోయింది. తమ అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రేమను ఓ సాధనంగా ఉపయోగిస్తున్నారు.

వయసు పొంగులో కలిగే కొన్ని రకాల శారీరక వాంఛలు తీర్చే ఓ సాధనంగానే చాలామంది యువత నేడు ప్రేమను సైతం భావించడం నిజంగా దురదృష్టకరం. అందుకే ఒకటి రెండుసార్లు పరిచయనికే ఐలవ్యూ చెప్పేసుకుని పార్కులు, పబ్బులు, డిస్కోలు అంటూ కలిసి తిరగడానికి సిద్ధమైపోతున్నారు. అయితే ఇలాంటి వాళ్లు వారి ప్రేమ బంధాన్ని జీవితాంతం కాపాడుకునేందుకు ప్రయత్నించేవారైతే వారు చేసే పనిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
  నిజమైన ప్రేమను గుండెల నిండా నింపుకుని దాన్ని జీవితాంతం కాపాడుకునేందుకు ప్రయత్నించే జంటలు లేకపోలేదు. అయితే అలాంటివారి సంఖ్య బహు అరుదుగా మాత్రమే ఉండడం నిజంగా దురదృష్టకరం.      


కానీ వీరిలో చాలామంది ప్రేమ అవసరం తీరగానే ఆవిరైపోతోంది. ప్రతి ఏడాదీ క్లాస్ మారినట్టు ప్రేమ, ప్రేమికుడు లేదా ప్రియుడు మారిపోతున్నారు. ఒకరిపై ప్రేమ కలిగినంత తొందరగానే వారిపై అయిష్టతను కూడా ప్రదర్శించేస్తున్నారు. అలాగే ఒకరిపై అయిష్టత కలిగి ప్రేమబంధం వద్దనుకునేంత లోపునే మరొకరితో ప్రేమ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి సిద్ధమైపోతున్నారు.

అయితే నిజమైన ప్రేమ ఎప్పటికీ తన స్వచ్ఛతను, తన పవిత్రతను కోల్పోదని చెప్పేందుకు వీలుగా నిజమైన ప్రేమను గుండెల నిండా నింపుకుని దాన్ని జీవితాంతం కాపాడుకునేందుకు ప్రయత్నించే జంటలు లేకపోలేదు. అయితే అలాంటివారి సంఖ్య బహు అరుదుగా మాత్రమే ఉండడం నిజంగా దురదృష్టకరం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...

Chevireddy: దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యత్నం... అరెస్ట్

Kodali Nani: కోల్‌కతా నుంచి కొలంబోకు కొడాలి నాని-ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

భర్తను వేటకొడవలితో నరుకుతుంటే భార్య పారిపోయింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments