Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?

Webdunia
FileFILE
ప్రేమ అనే పదం విన్నప్పుడు లోకంలోని ఎవరిలో ఎలాంటి భావం ఉదయించినా ప్రేమ అనే బంధంతో దగ్గరైనవారు మాత్రం ఆ పదం విన్న ప్రతిసారీ తమ ప్రేమ భాగస్వామిని గురించి మాత్రమే తల్చుకుని ఆనందంతో ఒక్కసారిగా పొంగిపోతారు. ఎందుకంటే ఇతర బంధాల ద్వారా దగ్గరైనవారికంటే ప్రేమబంధం ద్వారా మనసులు ముడిపడినవారి మధ్య ఏర్పడిన బంధం చాలా బలంగా ఉంటుంది కాబట్టి. అయితే ఇదే విషయానికి సంబంధించే సమాజంలో సైతం ప్రధానంగా విమర్శలు వినిపిస్తుండడం తెలిసిందే.

ఆకర్షణ కారణంగా ఏర్పడిన ప్రేమబంధం ఆ ఆకర్షణ కాస్తా తగ్గిపోగానే బంధం సైతం క్రమంగా బలహీనమవుతుందని అందుకే ప్రేమ విషయంలో ప్రేమికుల మధ్య ఉన్న బంధం ప్రారంభంలో ఉన్నంత బలంగా ఆ తర్వాతి రోజుల్లో ఉండదని చాలామంది భావిస్తుంటారు. అయితే వీరి వ్యాఖ్యల్లో కొంతవరకు నిజం ఉన్నా కేవలం ఆకర్షణ ప్రాతిపదికన కాకుండా అర్థం చేసుకుని, జీవితాంతం కలిసి ఉండాలనే కృతనిశ్చయంతో ప్రేమబంధం ఏర్పడిన జంటల మధ్య మాత్రం ఆ బంధం ఏనాటికీ బలహీనం కాబోదు. పైపెచ్చు కాలం గడిచేకొద్దీ అది క్రమంగా బలపడుతుంది కూడా.

పైన చెప్పుకున్న రెండు విషయాలు ఎలా ఉన్నా ప్రేమలో కొనసాగుతున్నవారు కొన్నిరోజులు గడిచాక తమ ప్రేమ ఇంకా స్వచ్చంగానే ఉందా... తమ ప్రేమలో ఎలాంటి అరమరికలు ఏర్పడలేదు కదా... ప్రేమించిన తొలిరోజుల్లో ప్రేమ భాగస్వామిపై ఉన్న ప్రేమభావం నేటికీ కొనసాగుతోందా... తమ ప్రేమ జీవితాంతం ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందా... అని ఒక్కసారి అలోచించినప్పుడు అన్నింటికీ సంతృప్తికరమైన సమాధానాలు రాగలిగితే వారి ప్రేమకు ఇకముందు ఏమాత్రం అడ్డంకులు రావనే చెప్పవచ్చు.


FileFILE
అలాకాక పై ప్రశ్నల్లో మెజారిటీ సంఖ్యకు సరైన సమాధానం రాకుంటే మాత్రం సదరు ప్రేమికులు తమ మధ్య ఉన్న బంధాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా మనసులను, భావాలను, అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకుంటున్నా ఇంకా వారి మధ్య ఏదో తెలియని అగాధం ఉన్నప్పుడు మాత్రమే పై ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించవు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు తమ మధ్య ఉన్నది సంపూర్ణమైన ప్రేమేనా... కేవలం ఆకర్షణ మాత్రమే... ఈ రెండూ కాకుండా ప్రేమ పేరుతో ఒకరినొకరు మోసం చేసుకుంటున్నామా అని మరోసారి ప్రశ్నించుకుంటే తప్పకుండా సమాధానం దొరికి తీరుతుంది.

ఇలా దొరికిన సమాధానాన్ని విశ్లేషించుకోగలిగితే ఇకముందు తమ ప్రేమను కొనసాగించాలా వద్దా అనే ప్రశ్నకు సైతం సమాధానం లభిస్తుంది. ఇలా లభించిన సమాధానం ప్రేమను కొనసాగించడం వృదా అన్నదే అయితే అలాంటి ప్రేమను తుంచుకోవడమే మంచిది. ఎందుకంటే పూర్తిగా కలిసిన మనసులు, కొంతైనా కలిసిన భావాలు లేని ప్రేమ ఏనాటికీ విజయం సాధించదు. కాబట్టి మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా.... ? ఓసారి తప్పకుండా పరిశీలించుకోండి.

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments