మరణంలోనూ వీడిపోను... ఓ ప్రేమికుని ధీనగాథ

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2008 (02:47 IST)
ప్రేమ కోసం చావడానికైనా సిద్ధపడేవారు ఈ కాలంలోనూ ఉన్నారంటే కొందరికి ఆశ్చర్యం అనిపించవచ్చు. ప్రేమకోసం కాస్త బాధపడి వదిలేయాలేగానీ అందుకోసం చచ్చిపోవడమేంటి అంటూ మరికొందరూ నీతి శతకాలు వల్లించేయవచ్చు. అయితే ప్రేమైనా మరొకటైనా తనదాకా వస్తేగానీ అందులోని తపన, బాధ ఎలా ఉంటుందో అందరికీ అర్థం కాదన్నది మాత్రం వాస్తవం.

అలా తన మనసులో ప్రేమను రగిలించి తన నుంచి శాశ్వతంగా దూరమైన తన ప్రేయసి కోసం ఓ ప్రియుడు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. ఇంతకీ అతను చేయాలనుకున్న ప్రాణత్యాగం ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో తెలుసా... ?

పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో నివాసముంటోన్న ఇర్ఫాన్ షేక్ వృత్తిరీత్యా వైద్యుడు. ఇతను తన సమీప బంధువైన ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయికి వెరొకరితో వివాహం అయ్యింది. దాంతో విపరీతమైన బాధకు గురైన ఇర్ఫాన్ షేక్ జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకున్నాడు.

అదేసమయంలో వెరొకరిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి రెండు రోజుల క్రితం మరణించింది. దాంతో తన ప్రేయసిలేని లోకంలో తనకేంపని అనుకున్న ఇర్ఫాన్ ఆమెతోబాటే మరణించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా నిద్రమాత్రలు మింగడంతో పాటు తన ప్రేయసి సమాధిని త్రవ్వి తననూ అందులోనే పూడ్చేసుకుని చచ్చిపోయేందుకు నిర్ణయించుకున్నాడు.

అనుకోవడమే కాదు అలాగే చేశాడు కూడా. అయితే నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో సమాధిలో పడి ఉన్న ఇర్ఫాన్‌ను స్థానికుల కాపాడడంతోపాటు పోలీసులకు అప్పగించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

కపాలభాతి ప్రాణాపాయం చేయండి... అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి : రాందేవ్ బాబా

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను చంపేశాడు.. మృతదేహాన్ని బైకుపై ఠాణాకు తీసుకెళ్ళాడు..

విమానంలో ప్రయాణికురాలికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Show comments