Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్ట్ ప్రేమలు... సూపర్ ఫాస్ట్ పెళ్లిళ్లు

Venkateswara Rao. I
WD
కాలం మారింది. ప్రేమించుకునే పద్ధతులూ మారాయి. ఈ విషయం శశాంక్‌ను చూసిన తర్వాత రాజేష్‌కు అర్థమైంది. తను కాలేజీలో చదువుకునే రోజుల్లో... ఉదయపు ట్యూషన్ నుంచి సాయంత్రం కాలేజీ పూర్తయ్యే వరకూ.... తనకు నచ్చిన... అంటే తను ఆరాధించే అమ్మాయిని పలుకరిద్దామని ఎంతగానో ప్రయత్నించేవాడు.

వెనుకటి సినిమాల్లో చూపించినట్లు... దారి మధ్యలో కాపుగాసి రోడ్డుపైనే మాట్లాడదామంటే... చెంప చెళ్లుమనిపిస్తుందేమోనని భయం. మొత్తానికి తన మనసు మెచ్చిన అమ్మాయితో మాట్లాడాలన్న ఆశ రాజేష్‌లో అలా రోజురోజుకీ పెరగసాగింది. చివరి సంవత్సరం పరీక్షలు పూర్తయి... ఎవరి దోవన వారు వెళ్లే సమయం రానే వచ్చింది.

గురుడు గుటకలు మింగుతూ అమ్మణ్ణితో మాట్లాడదామనుకుంటూ తన క్లాసు రూమ్‌లో మాటేసి కూర్చుకున్నాడు. ఎందుకంటే ఆమె స్నేహితురాళ్లు క్లాసులోనే ఉన్నారు మరి. అందుకనే అలా కూర్చుని ఉన్నాడు. చివరికి ఓ అందమైన యువతి అతని ముందు ప్రత్యక్షమైంది. అంతవరకూ రాజేష్ ఆమెను చూడనే లేదు.

ఎవరా అని చూస్తుండగానే... రాజేష్ అంటే మీరేనా....? మా అక్కయ్య... సుధ మిమ్మల్ని రమ్మంటోంది. అని చెప్పిందా యువతి. ఆమె మాటలు రాజేష్‌కి ముచ్చెమటలు పట్టించాయి.

తను రోడ్లపై ఆమెకోసం ఎదురుచూడటం, ఆమెకోసమే నిలబడి ఉండటం... వంటివన్నీ తెలుసుకున్నదా. కొంపదీసి... వాళ్ల అన్నయ్యలతో చితక బాదించదు కదా...అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ సుధ ఉన్నవైపు నడిచాడు. ఆశ్చర్యం.... ఎవరూ లేరు.

సుధ ఒక్కర్తే కూర్చుని ఉంది. తన వైపు చూడకనే... ఏదో చెప్పాలనుకుంటున్నారటగా... చెప్పండి అని బోల్డ్‌గా అడిగేసింది. అంతే... రాజేష్ గుండె వేగం పెరిగింది. అబ్బే మరేం లేదండీ... సరే ఏం లేకపోతే వస్తా అంటూ గబగబా లేచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లినవైపే చూస్తూ నిల్చుండిపోయాడు రాజేష్.

అసలు తను ఏదో చెప్పాలనుకుంటున్నట్లు... ఆమెకెవరు చెప్పారు..? ఆలోచనతో బుర్ర వేడెక్కింది. చివరికి ఓ నిర్ణయం వచ్చినవాడిలా... సైకిల్ తీసి వడివడిగా తొక్కుతూ రోడ్డుపై నడిచి వెళుతున్న ఆమెను క్రాస్ చేసి కాస్తంత ముందుకెళ్లి సైకిల్ స్టాండ్ వేసి అటుతిరిగి నిలబడ్డాడు.

ఆమె గమనిస్తూనే ఉంది. అతణ్ణి చూసి ముసిముసిగా నవ్వుకుంటూ మారుమాట్లాడకుండా వెళ్లిపోయింది. ఆమెతో ఏదో చెప్పాలనుకున్న రాజేష్ చెప్పకుండానే కాలేజీ చదువులు ముగించేశాడు. ఆ తర్వాత రెండేళ్లకి ఓ ఉద్యోగంలో చేరాడు. అయితే మనసంతా ఆ రోజుల్లోనే తేలియాడుతోంది.

రాజేష్‌కు పెళ్లి చేసి ఓ పని ముగించేద్దామనుకుంటున్న తల్లిదండ్రులకు తన కాలేజీ ప్రేయసి గురించి చెప్పాడు. అంతే... పెద్దల అంగీకారంతో " సుధ వెడ్స్ రాజేష్" జరిగిపోయింది. తన పెళ్లి ఇలా జరిగితే... తన పుత్ర రత్నం... శశాంక్ ఏకంగా తన స్నేహితురాలిని ఇంటికి తీసుకువచ్చి... తమను పరిచయం చేసి... మా ఇల్లూ వాకిలీ నచ్చిందా... అన్నీ ఒకేనా... అయితే ఇప్పుడు పెళ్లి గురించి అడుగుదాం అని అసలు విషయం పగలేశాడు. అదండీ ఫాస్ట్ ప్రేమలు... సూపర్ ఫాస్ట్ పెళ్లిళ్లు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా?

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments