ప్రేమ స్త్రీపురుష శరీరాల ఆకర్షణేనా?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2013 (16:08 IST)
File
FILE
చాలా మంది యువకులు తమకు నచ్చిన యువతిని గాఢంగా.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటారు. ప్రేమించిన యువతిని దక్కించుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతారు. తాను ఇష్టపడిన యువతితో ప్రేమ సాగించే సమయం.. క్షణాలను ఎంతో ఆనందంగా భావిస్తుంటారు. ఆమెనే నా భార్యగా స్వీకరించాలని నిర్ణయించుకున్నా. అనుకున్నదే తడవుగా సతీమణిని చేసుకున్న తర్వాత వారిద్దరి ఉన్న ప్రేమ ఎంత పటిష్టమైందో తేలిపోతుంది. అసలు అలా ఎందుకు జరిగింది.. జరిగేందుకు కారణాలేంటి అనే ప్రశ్నలు ఎదుటివారి నుంచి వస్తాయి. సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి.

నిజానికి అలా అనుకుంటే ప్రేమ శారీరకమైన ఆకర్షణకేనా...? ఆ కోరికలు తీరిపోతే, కోరికలతోపాటు ప్రేమ కూడా కరిగిపోతుందా...? స్త్రీ, పురుషుల నడుమ శారీరక ఆకర్షణ ఏర్పడటం ప్రకృతి సహజం. ఇందుకు కారణం రెండు వేర్వేరు రూపాలుండటం, వాటి మధ్య భిన్నధృవాలు వంటి అయస్కాంతపు ఆకర్షణ ఉండటం. పెళ్లికి ముందు ప్రేయసీప్రియులు కలుసుకున్నప్పడు.. ఒకరినొకరు పొగుడుకుంటూ.. తమలోని లోపాలను ఎత్తి చూపుతూ సరిచేసుకుంటూ ముందుకు పోతారు.

కానీ, వివాహమై ఒకే ఇంటిలో కలిసి బతికేటపుడు మాత్రం.. ఈ ప్రేమానురాగాలు వారిలో కనిపించవు. చిన్నచిన్న విషయాల్లో చిన్నపిల్లలు తరహాలో గొడవలు పడుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వారు వైవాహిక జీవితంపై ప్రభావం చూపడమే కాకుండా లైంగిక జీవనంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లోకమంతా నశించిపోయినా తరిగిపోనిది ప్రేమ అని చెప్పుకున్న వాళ్లు కూడా, కొంతకాలం తర్వాత ప్రేమను కోల్పోయి బతుకు వెళ్లదీస్తున్నారు.

అది ప్రేమ తప్పు కాదు. ప్రేమ అన్నది పెళ్లికి మొదటి మెట్టుగా భావించడం తప్పుడు లెక్క. ఒక స్త్రీ ప్రియురాలిగా ఉన్నప్పుడు ఆమెను ఎలా చూసుకున్నామో, అలాగే భార్యగా ఉన్నప్పుడు కూడా అలాగే చూసుకోవాలని మర్చిపోతున్నారు. ఇదే ప్రేమ తరిగిపోయిందనడానికి అసలు కారణంగా తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆయన అద్భుతంరా బుజ్జీ: డిప్యూటీ సీఎం పవన్ దాతృత్వంపై ప్రశంసలు

మోడీజీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి: అండర్ వరల్డ్ డాన్ కుమార్తె హసీన్ వీడియో ద్వారా విజ్ఞప్తి

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లుకు బ్రేక్.. సంబరాలు చేసుకుంటున్న వైకాపా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?