Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలోనూ వివేకం అవసరం

Webdunia
గురువారం, 25 సెప్టెంబరు 2008 (19:32 IST)
ప్రేమ అనే భావం రెండు మనసుల్లో చిగురించి అది బలపడిందంటే ఇక వారి మధ్య అన్యోనత కూడా పెరిగిపోతుంది. ఓర చూపులు, చూపుల సైగలు, పెదవి దాటని భావాలతో మొదలయ్యే ప్రేమ కావ్యం కొన్ని పేజీల తర్వాత పరిపూర్ణత సంతరించుకుంటుంది.

దాంతో ప్రేమికుల మధ్య అంతకుముందు ఉన్న అంతరాలు ఒక్కొక్కటిగా చెదిరిపోవడం ప్రారంభమవుతుంది. అలా అంతరాలు చెదిరిపోవడం ప్రారంభమయ్యాక ప్రేమికుల మధ్య ప్రారంభంలో ఉన్న బిడియాలు సైతం మాయమవుతాయి. బిడియం మాయమైపోవడంతో ప్రేమికులు తమ మదిలోని భావాలను గానీ, తమలోని ఆలోచనలను గానీ తమవారితో స్వేచ్ఛగా పంచుకోగల్గుతారు.

ఈ నేపథ్యంలో ఒకరి గురించి మరొకరికి మరింత వివరంగా అర్ధమయ్యే ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా ప్రేమ మైకం వారిని కమ్ముకున్న సమయంలో అంతకాలం మదిలో దాగిన చిలిపి కోరికలు సైతం బంధనాలు తెంచుకుని బయటపడడానికి సిద్ధమవుతాయి. అయితే ఇలాంటి తరుణంలోనే ప్రేమికుల మధ్య వివేకం చిగురించాల్సిన అవసరం ఉంది.


ప్రేమించుకునే సమయంలో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి అలా నడిచి వెళ్లడం, బైకుపై షికారుకెళ్లడం, ఒకరి కౌగిళ్లో ఒకరు వాలిపోవడం తరహా సంఘటనలు ఎక్కువయ్యే సమయానికే ప్రేమికులిద్దరూ తమ జీవిత బంధం గురించి ఓ స్థిర నిశ్చయానికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రేమ దశలో ప్రేమికుల మధ్య పైన చెప్పినవన్నీ కొనసాగుతున్నాయంటే అంతకంటే ముందున్న విషయాలు సైతం కావాలని మనసు ఆరాటపడుతోందనే విషయాన్ని గ్రహించి తీరాలి.

అలా గ్రహించినపుడు ఇక వారు తమ ప్రేమలో మరో ఘట్టంలోకి అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందనే అర్థం. ప్రేమ తర్వాత ఘట్టం అంటే పెళ్లి అని అందరికీ తెలిసిందే. ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో కొనసాగించితేనే ఆ ప్రేమకు పరిపూర్ణత లభిస్తుంది. అలా కాకుండా కేవలం ప్రేమలోకంలోనే ఉండిపోతామన్న పేరుతో ముద్దూ మురిపాల దశనుంచి మరికాస్త ముందుకెళ్లి ఆపై జీవితంలో ఒకటి కాలేక బాధపడేకంటే ప్రేమ దశలో కాస్త వివేకంతో వ్యవహరించడం చాలా ఉత్తమం.

ఎందుకంటే ప్రేమ అనేది జీవిత బంధానికి సంబంధించి ఓ తియ్యని కల లాంటిది. అది జీవితాంతం మనల్ని సంతోష పెట్టగలిగే ఓ మధుర కావ్యంగా ఉండాలి గానీ జీవితాంతం వెంటాడే భయంగా ఉండరాదు. అలా ప్రేమ అనేది భయాన్ని కాకుండా జీవితంలో ఆనందాన్ని కల్గించాలంటే ప్రేమించే దశలో ప్రేమికులకు కాస్త వివేకంతో ప్రవర్తించక తప్పదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా?

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments