Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకథ సుఖాంతం @ చెంప పండటం

Webdunia
WD
జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న సంఘటనలు పెను మార్పులకు దారి తీస్తుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని సంఘటనల వల్ల మంచి జరిగితే మరికొన్ని సంఘటనల వల్ల చెడు జరుగుతుంది. ఈ మంచి-చెడుల అనుభవాల సమ్మేళనమే జీవితం.. అలాంటిదే నా జీవితంలో జరిగిన ఈ సంఘటన.....

అవి మా కాలేజీ రోజులు..! ఎంతో సరదగా గడిచిపోతున్నాయ్.. కొత్త ఫ్రెండ్స్, కొత్త వాతావరణం, కొంచెం బిడియం, మరికొంచెం సంతోషం...!! రోజులు గడిచిపోతున్నాయ్.. అసలే ఫస్ట్ ఇయర్ కావడంతో విద్యార్థులంతా కాలేజ్‌లో ఎంతో వినయవిధేయత(కేవలం నటనే లెండి)లు ప్రదర్శిస్తున్నారు.

అలా సరదాగా గడిచిపోతున్న మా కాలేజీ రోజుల్లో.. కళాశాల వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన నోటీసు మా క్లాసుకు వచ్చింది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కొత్త(వింత)గా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అమ్మాయిలకు, అబ్బాయిలకు సంయుక్తంగా మెహిందీ(గోరింటాకు) పోటీని నిర్వహించారు.

ముందే చెప్పానుగా కొంచెం వింతగా అని..! సరే ఆ పోటీలో నేను కూడా పాల్గొన్నాను (పాల్గొనాల్సి వచ్చింది). ఎవరికి నచ్చిన డిజైన్లు వారు వేసి తమ టాలెంట్ చూపిస్తున్నారు. మరి నేనేమో.. కొంచెం కొత్త(వింత)గా మా కాలేజీ పేరును షార్ట్‌కట్‌లో "ఐ లవ్ గీతా.. ఇన్.. కాలేజ్" (గీతాంజలి ఇనిస్టిట్యూట్ అండ్ కాలేజ్) డిజైన్‌గా రాశా..! ఓ ఐడియా మీ జీవితాన్ని మార్చేసినట్లుగా.. ఓ డిజైన్ నా జీవితాన్ని మార్చేసింది.

కాలేజీ మీద నా ప్రేమ మండిపోనూ... అని అప్పట్లో అనుకున్నా..! అందుకు బలమైన కారణం ఉంది. అదేంటంటే.. ఆ డిజైన్ చేసిన తర్వాత నా పక్కనే ఉన్న అమ్మాయికి చూపించి ఎలా ఉంది అని అడిగా..? ఆ అమ్మాయి మారు మాట మాట్లాడకుండా.. తన గోరింటాకు చేతితో నా చెంప ఛెళ్లుమనిపించింది. నాకు లిప్తపాటు కాలం ఏం అర్థం కాలేదు.. తను ఎందుకలా.. ప్రవర్తించిందా అని..!! ఆ అవమానంతో రెండు రోజులు కాలేజీకి వెళ్లలేదు.

మూడో రోజు.. మా ఇంటి డోర్ బెల్ మోగింది. డోర్ తీస్తే.. ఎదురుగా నా చెంప ఛెళ్లునిపించిన యువతి. చటుక్కున రెండు చేతులతో నా చెంపలు దాచేశాను. తను చిరునవ్వు నవ్వి "ఐ యామ్ సారీ" అన్నది. అదే ఆ అమ్మాయి నాతో మాట్లాడిన తొలి మాట. నేను ఆశ్చర్యంతో ఎందుకు అన్నాను. అదే.. ఆ రోజు అనవసరంగా మీపై చేయి చేసుకున్నాను కదా.. అందుకే సారీ అన్నది.

నేను అమాయకంగా.. అవును అసలు ఎందుకు కొట్టారు అన్నాను. అందుకు ఆ అమ్మాయి "నా పేరు గీతా" అని సమాధానమిచ్చింది. అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నాను. సారీ అండి నేను మీ పేరు రాయలేదు, కాలేజ్ పేరు రాశాను అని చెప్పా..! అది ఆలస్యంగా తెలుసుకున్నానండీ అందుకే సారీ చెబుదామని వచ్చా అంది ఆ అమ్మాయి. అప్పుడు తను మరోసారి పెద్దగా నవ్వింది. ఎందుకో తెల్సా.. ఆ అమ్మాయి గోరింటాకు చేతితో కొట్టడం వల్ల నా చెంప అంతా ఎర్రగా పండిపోయి ఉండటం చూసి.

అలా మొదలైంది మా ఇద్దరి మధ్య స్నేహం..! కాలగమనంలో అదికాస్తా.. ఫెవికాల్ స్నేహంగా మారింది. రోజులు వెళ్లిపోతున్నాయ్..! తిరిగి చూస్తే... కాలేజీ రోజులు అయిపోయాయి. వెంటనే కేరీర్ ప్లానింగ్ కోసం రాష్ట్రం వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ గ్యాప్‌లో తనకూ.. నాకూ ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. అలా జాబ్ కోసం కొన్ని నెలలపాటు ప్రయత్నిస్తుండగా.. ఓ ఇంటర్వ్యూలో గీత కనిపించింది. గీత కనబడటం వల్లనో ఏమో.. నేను ఆ జాబ్‌కు సెలక్ట్ అయ్యాను. ఆశ్చర్యం ఏంటంటే.. గీత కూడా జాబ్‌కు సెలక్ట్ అయింది.

ఆగిపోయిందనుకున్న మా స్నేహ ప్రయాణం మరోసారి మొదలైంది. ఈసారి అది కాస్తా.. ఫెవికిక్ ప్రేమగా మారింది. భగవంతుడి దయ వలన సినిమాల్లో ప్రేమల్లాగా.. మా ప్రేమలో ట్రాజెడీ లేదు. పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. దాంతో మా ప్రేమకథ సుఖాంతమైంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments