Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల-దమయంతుల ప్రేమకథ

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2007 (12:39 IST)
విదర్భ దేశానికి రాజైన భీముని పుత్రిక దమయంతి మరియు నిషిధ రాజాధిపతి వీరసేనుని కుమారుడు నలుడు. ఒకరి గుణగుణాలను గురించి ఒకరు తెలుసుకుని నలదమయంతులు ప్రేమలో పడతారు. నలుని ఊహాచిత్రాన్ని మదిలో ప్రతిష్ఠించుకుంటుంది దమయంతి. ఈ నేపథ్యంలో దమయంతికి అర్హుడైన వరుని కోసం విదర్భరాజు భీముడు స్వయంవరం ప్రకటిస్తారు. నలునితో పాటు స్వర్గాధిపతి ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మరియు యమధర్మరాజు స్వయంవరానికి విచ్చేసి దమయంతిని పరిణయమాడలని ఉవ్విళ్లూరుతారు.

అంతటితో ఆగక దమయంతి ప్రేమకు పరీక్ష పెడుతున్నట్లుగా దేవతలు నలుగురు నలుని రూపంలో స్వయంవరంలో పాలు పంచుకుంటారు. స్వయంవరంలో ఐదుగురు నలమహారాజులు పాల్గొనటాన్ని చూసి విదర్భ రాజసభ విస్తుపోతుంది. ఇటువంటి సంకట సమయంలో ఇష్టదైవాన్ని ప్రార్ధించిన దమయంతి, మదిలో ప్రతిష్ఠించుకున్న తన ప్రియతముడు నలమహారాజు కనులముందు కదలాతుండగా, ఐదుగురిలో తన ఊహకు సరితూగుతున్న నలుని మెడలో వరమాల వేస్తుంది. అతడే అసలైన నలమహారాజు. దమయంతి నిష్కల్మషమైన ప్రేమకు మెచ్చిన దేవతలు నిజరూపాన్ని ధరించి జగతికి ఆదర్శంగా నిలిచిన ఆ ప్రేమజంటను ఆశీర్వదించి అంతర్ధానమవుతారు.

ఇరురాజ్యాల ప్రజల ఆనందోత్సాహాల నడుమ నలదమయంతుల వివాహం అంగరంగవైభోగంగా జరుగుతుంది. శనిప్రభావం ఎంతటి వారినైనా అధోగతి పాల్జేస్తుంది. ఇందుకు నలుడు మినహాయింపు కాదు. శనిప్రభావంతో, సోదరుడైన పుష్కరుని చేతిలో జూదంలో ఒడిపోయిన నలుడు రాజ్యభ్రష్టుడువతాడు. నలదమయంతులు కారణవశాన విడిపోతారు. తొలుత ఒక రాజ ప్రాసాదంలో చెలికత్తెగా చేరిన దమయంతి, అనంతరం తన తల్లిదండ్రల పంచన చేరుతుంది. నలుని జాడ తెలుసుకొనుట కొరకు భీమరాజు దమయంతికి స్వయంవరం ప్రకటిస్తాడు. ఇదిలా ఉండగా దమయంతిని వీడిన నలుడు అడవులలో తిరుగుతుండగా కర్కోటకమనే సర్పం నలుని కాటేస్తుంది.

దీంతో నలుని దేహఛాయ నలుపురంగులోకి మారిపోతుంది. నలుడు కురిపి అవుతాడు. నలుని ఎవ్వరూ గుర్తించలేని పరిస్థితి తలెత్తుంది. బాహుకుని పేరుతో రధసారధిగా మారి విదర్భ రాజ్యానికి చేరుకుంటాడు నలుడు. పవిత్ర ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే దమయంతికి వికృతరూపంలోని నలుని ఇట్టే గుర్తించింది. కలసిన జంట ఆనందానికి అంతేలేదు. శనిప్రభావం తొలగింది. నలుని వికృతరూపం మాయమై నిజరూపం కలిగింది. పుష్కరునితో మరోసారి జూదమాడిన నలుడు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుంటాడు.

దమయంతి కేవలం రూపవతియే కాదు నలుని ప్రేమ పట్ల అచంచలమైన అనురాగాన్ని ప్రదర్శించి నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. స్వయంవరంలో దేవతల సౌందర్యానికి లోనుకాక నలుని వరించింది దమయంతి. అంతేకాక వికృతరూపంలోని నలుని బాహ్యరూపాన్ని కాక అంతఃసౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చి స్వచ్ఛమైన ప్రేమకు దమయంతి తార్కాణమైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

Show comments