Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది మోస్ట్ లవ్లీ క్వీన్ లవ్‌స్టోరీ

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2007 (20:04 IST)
WD PhotoWD
వేల్స్ యువరాణి డయానా ప్రేమపురాణంలో అధ్యాయాలు అనంతం. ఆమె మాజీ భర్త ప్రిన్స్ చార్లెస్‌తో సహా పది మంది పురుషులు ఆమె ప్రేమను చవిచూసారంటే ఆశ్చర్యం కలిగించకమానదు. 1981వ సంవత్సరంలో ప్రిన్స్ ఛార్లెస్‌తో జరిగిన వివాహం మూడునాళ్ల ముచ్చటగా ముగియడంతో డయానాకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లయ్యింది. ప్రిన్స్ చార్లెస్‌తో ప్రారంభమైన ఆమె ప్రేమయాత్ర మరణంలో సైతం తన వెన్నంటి వచ్చిన దోడి ఫయేద్‌తో ముగిసింది.

డయానా జీవితంలోకి ప్రవేశించి ఆమె తొలిప్రేమను అందుకున్న పురుషుడు ఆమె భర్త ప్రిన్స్ చార్లెస్. ఇరువురి మధ్య అభిప్రాయబేధాలతో వారి ప్రేమకథ విడాకులతో ముగిసింది. విపత్కర పరిస్థితులలో తన భుజాలపై రోదించేంత సాన్నిహిత్యాన్ని డయానాతో ఏర్పరుచుకున్న ఆమె అంగరక్షకుడు బార్రీ మన్నాకీ రాచకుటుంబీకుల ఆగ్రహాన్ని చవిచూసి ఆమె ప్రేమకు దూరమయ్యాడు. అటు మీడియా ప్రచారానికి, ఇటు భర్తతో వివాహబంధం విచ్ఛినం కావచ్చునన్న భయంతో తనతో విహారయాత్రలకు వచ్చిన డేవిడ్ వాటర్‌హౌస్‌ను డయానా దూరం చేసుకుంది.

1989 వ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన కార్ల అమ్మకందారుడు జేమ్స్ గిల్బే, డయానాలు టెలిఫోన్ ద్వారా జరిపిన వ్యక్తిగత సంభాషణ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కడంతో వారి వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. డయానాతో తనకుగల సాన్నిహిత్యాన్ని లైఫ్‌గార్డులకు కెప్టన్‌గా వ్యవహరించిన జేమ్స్ హావిట్‌
WD PhotoWD
పత్రికలకువిడుదల చేయటంతో డయానా హావిట్‌కు గుడ్‌బై చెప్పేసింది. డయానాతో ప్రేమవ్యవహారం మొదలుపెట్టిన ఆర్ట్ డీలర్ తరువాత బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో డయానాకు దూరమయ్యాడు. డయానాతో పీకలదాకా ప్రేమలోపడ్డ అంతర్జాతీయ రగ్బీ ఆటగాడు విల్ కార్లింగ్ ఇంటిపోరు పడలేక డయానాకు బై చెప్పేసాడు.

డయానాతో హృద్రోగ వైద్యనిపుణుడు హస్నర్‌ఖాన్, డయానాతో జరిపిన ప్రేమవ్యవహారం పాపరాజ్జీల బెడదతో అర్థాంతరంగా ముగిసిపోయింది. డయానాపై పాట కట్టి ఆమెపై తన ప్రేమను చాటుకున్న పాప్‌సింగర్ బ్రియాన్ ఆడమ్స్, అనంతర కాలంలో డయానా, ఆడమ్స్ ప్రేమ జంట ఒక అంగీకారానికి వచ్చి వీడిపోయారు. విలువైన కానుకలతో డయానా ప్రేమను చూరగొన్న సినీనిర్మాత ఎమద్ దోడి ఫయేద్ 1997వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన జరిగిన కారు ప్రమాదంలో డయానాతో పాటు మరణించి తన ప్రేమను అజరామరం చేసుకున్నాడు.

కారణమేదైనా, కారకులెవరైనా ప్రేమ పేరిట డయానా జీవితంలోకి పదిమంది పురుషుల ప్రవేశం నేటి యువతకు ఓ హెచ్చరికలాంటిది.

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

Show comments