Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిచూపు ప్రేమ మాధుర్యం

Munibabu
శనివారం, 26 జులై 2008 (13:04 IST)
ఎంత చెప్పినా ఎంతగా మాట్లాడినా ఎంతగా నివేదించినా మాధుర్యం తగ్గని ఓ ప్రత్యేకమైన భావమే ప్రేమంటే. ప్రేమ గురించి రాజ్యాలనే త్యాగం చేసినవారున్నారు. ప్రేమకోసం చచ్చిపోయిన వాళ్లున్నారు. తమ ప్రేమకోసం మరొకరిని చంపేసినవారున్నారు. రెండూ చేతగాక తమలోని ప్రేమనే చంపేసుకున్నవారూ ఉన్నారు.

ఇలా ప్రేమ కోసం లోకంలో ఎన్నెన్నో చేసినవారున్నారు. ఆ ప్రేమకోసం ఏం చేయడానికైనా సిద్ధమనేవారూ ఉన్నారు. ప్రేమలో ఎవరికీ తెలియని మహత్తర శక్తి ఏదో దాగుందని అందుకే ప్రేమకోసం ఏం చేయడానికైన సిద్ధపడుతుంటాడని అందరూ చెబుతుంటారు.

ఇవన్నీ విన్నప్పుడు మనసు పొరల్లో ప్రేమచేసే ఆ అలజడి అంత గొప్పదా...? దానికి అంత శక్తి ఉందా...? అని అనిపిస్తుంటుంది. అయితే ఇంతలా మనిషిని మార్చే శక్తిగల ప్రేమ ఒక్కోసారి హటాత్తుగా మనిషి గుండె తలుపు తడుతుంది. దాని పేరే తొలిచూపు ప్రేమ. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని అందరూ చెప్పేస్తుంటారు.
  కళ్ల ముందు మెరిసిన మెరుపులా, బస్సు ప్రయాణంలో వెనక్కి వెళ్లిపోయే ప్రకృతిలా తొలిచూపు ప్రేమభావం సైతం కొంత కాలానికి మనిషి నుంచి దూరం అయిపోతుంది.      


అప్పటివరకు కలలో కూడా చూచి ఎరగని వారిని చూడగానే మనసులో పొరల్లో ఎక్కడో ఓ చిన్నపాటి అలజడి ప్రారంభమవుతుంది. ఆ అలజడి క్రమేపీ పెద్దదై వారు లేనిదే తాను ఉండనేమో అన్న స్థితిని కల్పిస్తుంది. అప్పటివరకూ ఏమీకాని, అసలేమీ తెలియనివారిపై ఈ భావం ఏంటని మనసు ప్రశ్నిస్తే దాని దగ్గర సమాధానం దొరకదు.

అయితే వారు మాత్రం తనకు కావల్సిందే అంటూ చిన్న పిల్లల్లా మారాం చేయడం మాత్రం ఆ క్షణం నుంచి ప్రారంభించేస్తుంది మనిషి మనసు. అలా మనసు చేసే మారాంని తట్టుకోలేక పడే అవస్థ సైతం ఎందుకో మనిషికి తియ్యగానే అనిపిస్తుంది. అందుకే అన్నారేమో ప్రేమంటే తియ్యని బాధ అని.


బాధలోనూ తియ్యదనాన్ని రుచి చూపిస్తుంది కాబట్టే ప్రేమ అంటే మనిషిలో ఎప్పటికీ తరగని మక్కువ ఉంటోంది కాబోలు. అయితే మిగిలి ప్రేమలతో పోలిస్తే తొలిచూపు ప్రేమకు ఈ బాధ కాస్త ఎక్కువనే చెప్పవచ్చు. కనీసం పేరూ ఊరు అసలెవరో కూడా తెలియని వారికోసం మనసు మారం చేస్తుంటే వారి కోసం అన్వేషించి వారిలోనూ ప్రేమభావాన్ని రగిలించి చివరకు సొంతం చేసుకోవడం అంటే ఎంతటి ఓర్పు, సహనం కావాల్సి ఉంటుంది.

ఇదంతా జరగాలంటే తొలిచూపు ప్రేమలో ఎవరికీ అర్థంకాని, పడ్డవారికి సైతం తెలియనంత గాఢత ఉండాలి. తొలిచూపు ప్రేమలో అంతటి గాఢత ఉంటేనే అది ముందు ముందు ఇరు హృదయాల ప్రేమగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. అలా లేకుంటే కళ్ల ముందు మెరిసిన మెరుపులా, బస్సు ప్రయాణంలో వెనక్కి వెళ్లిపోయే ప్రకృతిలా తొలిచూపు ప్రేమభావం సైతం కొంత కాలానికి మనిషి నుంచి దూరం అయిపోతుంది.
  తళుక్కున కళ్లముందు మెరిసి మనసు పొరల్లో చొచ్చుకుపోయే వారిలో తమకు నచ్చిన లక్షణాలే ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వారు సైతం మనల్నే మెచ్చాలన్న రూలూ లేదు. అలాగే తొలిచూపు ప్రేమలో ఇరువైపులా ప్రేమ పుట్టడం అన్నది బహు స్వల్పం.       


కాలం వేగాన్ని సంతరించుకున్న ప్రస్తుత తరుణంలో ప్రేమ సైతం వేగంగా మారిపోయింది. అప్పటివరకూ తమకు బాగా పరిచయం ఉన్నవారిలోనో లేక తమకు అందుబాటులో ఉన్న వారిలోనో తమకు నచ్చిన అంశాలు కన్పిస్తే వారికే ఐలవ్యూ చెప్పేసి వారు కూడా ఒప్పుకుంటే అటుపై జీవితంలో ఒకటవడానికి ప్రయత్నించడం ఎక్కువై పోయింది.

అయితే తొలిచూపు ప్రేమలో ఈ తరహా ప్రయత్నాలు అస్సలు పనిచేయవు. ఎందుకంటే తళుక్కున కళ్లముందు మెరిసి మనసు పొరల్లో చొచ్చుకుపోయే వారిలో తమకు నచ్చిన లక్షణాలే ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వారు సైతం మనల్నే మెచ్చాలన్న రూలూ లేదు. అలాగే తొలిచూపు ప్రేమలో ఇరువైపులా ప్రేమ పుట్టడం అన్నది బహు స్వల్పం.

అందుకే తొలిచూపు ప్రేమను సొంతం చేసుకోవాలంటే అంతులేని నీరీక్షణ, చేపలేనంత ఓర్పు, వీటన్నింటికీ మించి తొలిచూపులోనే ఆకర్షించిన వారిపై వల్లమాలిన ప్రేమ ఉంటేనే తొలిచూపు ప్రేమ మాధుర్యం మనిషి చివరిచూపు వరకు కొనసాగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...

Chevireddy: దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యత్నం... అరెస్ట్

Kodali Nani: కోల్‌కతా నుంచి కొలంబోకు కొడాలి నాని-ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

భర్తను వేటకొడవలితో నరుకుతుంటే భార్య పారిపోయింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments