Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవించండి... కలకాలం ప్రేమికుల్లా

Webdunia
FileWD
ప్రేమించడం గొప్పకాదు... ఆ ప్రేమను కలకాలం నిలబెట్టుకోవడమే గొప్ప అన్న మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే ప్రేమ ఎంతటి మధురమైన భావనో అది విఫలమైతే అంతటి శాపంగా పరిణమిస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రేమించిన వారిని దక్కించుకోవడమే కాదు వారి సమక్షంలో జీవితాన్ని సంతోషంగా గడపగలగడమే గొప్ప.

మరి ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించేకంటే... ఆచరించడానికి ప్రయత్నిస్తే ప్రేమను నిలబెట్టుకోవడం మరీ అంత కష్టమేమీ కాదని చెప్పవచ్చు. ఓ అమ్మాయి మీద అబ్బాయికి, ఓ అబ్బాయి మీద అమ్మాయికి ప్రేమ కలిగినపుడు ఆ విషయాన్ని ఎదుటివారికి చెప్పి వారిలోనూ ప్రేమను పుట్టించి చివరకు వారిని తమవారిగా చేసుకునే వరకు కనిపించే ఆతృత, ఆరాటం వర్ణించడానికి వీలుకాదు.

ఎదుటివారి వద్ద తమ ప్రేమను వ్యక్తీకరించిన క్షణంనుంచి వారిలోనూ ప్రేమభావం పుట్టేవరకు మనిషి పడే ఆరాటం అంతా ఇంతాకాదు. ఇలా మనిషి పడే ఆరాటం తనమీద ఎదుటివారిలోనూ ప్రేమ ప్రారంభమై ప్రేమికులుగా కొత్త అవతారం ఎత్తిన తర్వాత కాలం గడిచేకొద్దీ అంతకుముందు ఉన్న ఆసక్తి, ఆవేశం తగ్గుతూ వస్తుంది. అయితే ఈ ఆసక్తి తగ్గడం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఎదుటివారు కూడా మనల్ని ప్రేమిస్తున్నారు కదా అన్న నిశ్చింతవల్ల వచ్చే ఉదాసీనత కొందరిదైతే, ఎదుటివారూ మనల్ని ప్రేమించేశారు కదా అన్న ధైర్యం కొద్దీ వచ్చే ఉదాసీనత మరికొందరిది.


FileWD
అయితే మొదటిరకం ఉదాసీనత వల్ల ప్రేమికుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం కాస్త తక్కువేనని చెప్పవచ్చు. ఎందుకంటే తన ప్రేయసి లేదా ప్రియుడు తన నుంచి దూరమవుతున్నారన్న అనుమానం రాగానే తమ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని బలీయం చేసుకోవడానికి వారు వెంటనే సిద్ధమవుతారు. దీనివల్ల కొద్దో గొప్పో పొరపచ్చాలు వచ్చినా ఈ తరహా ప్రేమ జంటలు వెంటనే తమ బంధాన్ని పునరుద్ధరించుకుంటారు.

అదేసమయంలో రెండోరకం ఉదాసీనత వల్ల ప్రేమికుల మధ్య ఏర్పడే పొరపచ్చాలు చినికి చినికి గాలివానగా మారే అవకాశం ఉంది. ఇలా సదరు ప్రేమికుల మధ్య ఏర్పడే పొరపచ్చాలు చివరకు వారి బంధంలో చిచ్చుపెట్టే స్థాయికి చేరుకుంటుంది. ఎందుకంటే ముందే చెప్పినట్టు ఎదుటివారూ మనల్ని ప్రేమిస్తున్నారు కదా అని వచ్చిన ధైర్యం వల్ల ఎదైనా చిన్నా చితకా గొడవ వచ్చినప్పుడు ఎదుటివారే తగ్గిరావాలనే పంతం ఇలాంటి ప్రేమికులకు బలంగా ఉంటుంది. దీంతో సదరు ప్రేమికుల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా కొద్దిరోజుల్లోనే వారు విడిపోయే పరిస్థితిని తీసుకొస్తుంది.

పై అంశాలను ఆధారంగా ప్రేమికులు విడిపోవడానికి కారణం ప్రధానంగా వారి మధ్య అవగాహన లోపించడమే అని చెప్పవచ్చు. అదేసమయంలో కేవలం ఆకర్షణవల్ల తమ మధ్య ఏర్పడిన తాత్కాలిక బంధాన్ని ప్రేమగా భ్రమపడినవారి మధ్యా ఈ రకమైన అగాధం ఏర్పడడం మామూలే. కాబట్టి ప్రేమ బంధం కలకాలం నిలవాలంటే ప్రేమికుల మధ్య సంపూర్ణమైన నమ్మకం, ఒకరిపై ఒకరికి ఎప్పటికీ సమసిపోని ఇష్టం, తమ మధ్య చిగురించిన ప్రేమను చివరివరకు నిలబెట్టుకోవాలనే తపన ముఖ్యం.

పైన పేర్కొన్న అంశాలు ఉన్నప్పుడు ప్రేమికుల మధ్య చిన్నా చితకా గొడవలు వచ్చినా వారు విడిపోవడమనేది మాత్రం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ప్రేమను కాపాడుకోవాలనుకునే వారిమధ్య నుంచి ప్రేమకూడా ఎగిరిపోవాలని ఎన్నటికీ అనుకోదు కాబట్టి.

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments