Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిల్లికజ్జాలతో సంపూర్ణ ఆయుర్ధాయం

Webdunia
గురువారం, 24 జనవరి 2008 (19:08 IST)
గిల్లికజ్జాలు పెట్టుకునే అమ్మాయి... నీ కళ్లల్లో ఉన్నది భలే బడాయి... అని వెండితెర మీద తెరవేలుపు ఆడుతూ పాడుతూ ఉంటే అనేకమంది ఆనందంగా ఆస్వాదించడం అందరికీ తెలిసిందే. అయితే అమ్మాయిల గిల్లికజ్జాలను వెక్కిరించే అబ్బాయిలు, తమను తాము తక్కువగా భావించక తమ వంతు పాత్రగా గిల్లికజ్జాలను మొదలుపెడితే సంపూర్ణ ఆయుర్ధాయాన్ని సంపాదించుకోవచ్చునని మిచిగాన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొంటున్నారు.

భావోద్వేగాలను నియంత్రించుకుని కాపురం సాగించే జంటలు, భావోద్వేగాలను ప్రదర్శించే జంటలతో పోలిస్తే తక్కువ కాలం మాత్రమే జీవిస్తారని నిపుణులు అంటున్నారు. ఆవేశకావేశాలను అదుపులో పెట్టకునే బదులు వాటిని వెళ్లగక్కడంతో ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చునని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. భావోద్వేగాలను బయటపెడితే తీవ్రస్థాయి వాదోపవాదాలు చోటు చేసుకుంటాయనే భయంతో వాటిని సీసాలోకి తోసేసి, బిరడా పెట్టేసే పని మాత్రం చేయకండి. అలా చేయడం వలన ఆందోళన అధికమైపోయి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.

ఈ సంగతులను బయటపెట్టిన అధ్యయానికి గాను పరిశోధకులు 192 జంటలను ఎంపిక చేసుకుని, వారిని నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి, 17 సంవత్సరాల కాలం పాటు వారి ప్రవర్తనను పరిశీలించారు. మొదట కేటగిరీలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసే జంటలు, రెండవ కేటగరీలో భర్త కోప్పడితే, భార్య ఆగ్రహాన్ని అణుచుకోవడం, మూడవ కేటగిరీలో భార్య మాత్రమే ఆగ్రహాన్ని ప్రదర్శించడం ఇక చివరిదైన నాలుగవ కేటగిరీలో భార్యాభర్తలిద్దరూ కోపాన్ని అదుపులో ఉంచుకునేవారు. మిగిలిన మూడు కేటగిరీల కన్నా మొదటి కేటగిరీకి చెందిన భార్యాభర్తలు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనంలో తేలింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

Show comments