Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి ప్రేమిస్తే చాలు... ఇక జీవితాంతం...

Webdunia
WD

ఎన్నటికీ మరువలేని తీయనైన బంధం... అద ి!!

అవును. ఒకే ఒక్కసారి ఒకరిని ప్రేమిస్తే చాలు. జీవితాంతం సదరు ప్రేయసి/ప్రియుని మరచిపోలేరట. ప్రేమలో పడిన ఆ రెండు మనసులు ఎన్నటికీ విడిపోలేవట. ఒకవేళ విడిపోయామని సదరు ప్రేమికులు అనకున్నప్పటికీ... అది వారి భ్రమే. ఇరువురిదీ నిజమైన ప్రేమ అయినట్లయితే వారి మనసులు ఆ భావనను ఎన్నటికీ వీడలేవు. ప్రేమ, మనసుపై దాని ప్రభావం అంశాలపై అధ్యయనం చేసిన పరిశోధకులు ఇదే నిజమని అంగీకరిస్తున్నారు.

అప్పుడే టీనేజ్‌లో అడుగుపెట్టి పలు కారణాలవల్ల విడిపోయిన కొన్ని జంటలపై ఇంగ్లండుకు చెందిన ఓ పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. ఇరువురు కలుసుకోలేని దూరతీరాల్లో ఉన్నప్పటికీ ఒకరిపట్ల ఒకరికి కలిగే ప్రేమ స్పందనలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదని వారి అధ్యయనంలో వెల్లడైంది.

ప్రేమించి పెళ్లిచేసుకున్నవారిలో తమ తొలిచూపు పరిచయపు భావనలు మనసులో నిక్షిప్తమై ఉన్నాయనీ, తొలినాటి పరిచయపు అనుభూతితోనే తమ భాగస్వామిని చూస్తున్నారని తేలింది. దాదాపు 20 ఏళ్ల క్రిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లోనూ ఇదే పరిస్థితి కనబడింది.

శృంగార భావనలతో పెనవేసుకున్న ప్రేమ బంధం... ఎంతోకాలం నిలువదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే ఆ అనుభూతిని చవిచూసిన సదరు ప్రేయసి/ప్రియుడు ఎన్నటికీ మరువలేరని అధ్యయనంలో వెల్లడైంది.

ప్రేమికుల మనసుల్లో నిజమైన ప్రేమకు ఉన్న స్థానం ఏపాటిదే నిగ్గు తేల్చటానికి 17 మంది ప్రేమికులు/ప్రియురాళ్ల మెదళ్లను స్కాన్ చేశారు. వారంతా పెళ్లి చేసుకుని ఒక ఇంటివారైనప్పటికీ... తొలిప్రేమనాటి భావనలు ఇంకా వారి మనసుల్లో కదలాడుతూ ఉండటాన్ని గమనించారు. తమ ప్రేయసి/ప్రియునితో గడిపిన అనుభూతి ముద్రలను తమ మనసుల్లో శాశ్వతంగా ముద్రించుకున్నట్లు తేలింది.

అంతేకాదు కేవలం నెలల వ్యవధిలో దగ్గరైన ప్రేమికులు సైతం ఇదే భావన కలిగి ఉండటాన్ని గమనించారు. కనుక ఒక్కసారి లవ్‌లో పడితే అది చచ్చేంతవరకూ మనసును వదలిపోదన్నమాట. ఒకవేళ మర్చిపోయామన్న భావన ఉన్నప్పటికీ అది గుర్తుకు వస్తూనే ఉంటుంది. లవ్ ఈజ్ ఎవర్ గ్రీన్...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Show comments