Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఫస్ట్, శ్రీకాకుళం లాస్ట్... ఏపీ ప్రభుత్వం టార్గెట్... దేనిపై...?

అభివృద్ధిలో ఏపీలో వెనుకబడిన జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(ఎస్ జీడిపి-స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్) వృద్ధి రేటు గత సంవత్సరం (2015-16) 10.99 శాతం, ఈ ఏడాది అర్ధ సంవత్సరంలో 12.23 శాతం సాధించి దేశంలో అగ్రభాగ

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (18:04 IST)
అభివృద్ధిలో ఏపీలో వెనుకబడిన జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(ఎస్ జీడిపి-స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్) వృద్ధి రేటు గత సంవత్సరం (2015-16) 10.99 శాతం, ఈ ఏడాది అర్ధ సంవత్సరంలో 12.23 శాతం సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. అయినప్పటికీ  రాబోయే 5 ఏళ్లలో 15 శాతం వృద్ధి రేటు కొనసాగించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఈ ఏడాది కూడా నిర్ధేశించుకున్న 15.23 శాతం వృద్ధి రేటును సాధించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ- గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్) తక్కువగా వున్న జిల్లాలపై ఇక పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు.
 
తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఉత్పత్తిలో చివరనున్న శ్రీకాకుళం
జిల్లా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెండింటిలో శ్రీకాకుళం జిల్లా వెనకబడి చివరి స్థానంలో ఉంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో కూడా ఈ జిల్లా చివరి స్థానంలోనే ఉంది. గత సంవత్సరం సరాసరి తలసరి ఆదాయం రూ.1,07,532  ఉండగా విశాఖ జిల్లా రూ. 1,40,593 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లా రూ.74,638లతో చివరి స్థానం(13)లో ఉంది. రూ.86,223తో విజయనగరం జిల్లా 12వ స్థానంలో, రూ.88,308తో కర్నూలు జిల్లా 11వ స్థానంలో, రూ.98,084తో అనంతపురం జిల్లా 10వ స్థానంలో, రూ.91,888తో కడప జిల్లా 9వ స్థానంలో, రూ.1,00,443తో చిత్తూరు జిల్లా 8వ స్థానంలో ఉన్నాయి. 
 
గత సంవత్సరం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 6,03,376 కోట్లతో వృద్ధి రేటు 10.99 శాతం సాధించడం జరిగింది. జిల్లా స్థూల ఉత్పత్తితో కృష్ణా జిల్లా రూ.72,219 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా,  శ్రీకాకుళం రూ.22,707 కోట్లతో చివరి స్థానం(13)లో ఉంది. విజయనగరం జిల్లా రూ.22,924 కోట్లతో 12వ స్థానంలో, కడప జిల్లా రూ.29,826 కోట్లతో 11వ స్థానంలో, నెల్లూరు జిల్లా రూ.38,793 కోట్లతో 10వ స్థానంలో, కర్నూలు జిల్లా రూ. 39,876 కోట్లతో 9వ స్థానంలో, ప్రకాశం జిల్లా రూ. 40,732 కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి. 
 
శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలు పారిశ్రామికంగా వరుసగా చివరి ఆరు స్థానాలలో ఉన్నాయి. ఈ జిల్లాలన్నీ ఏయే రంగాలలో, ఎందుకు వెనుకబడి ఉన్నాయో అధ్యయనం చేసి, ఆ రంగాలలో ఆయా జిల్లాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందింస్తోంది. వృద్ధి, అభివృద్ధి సమాంతరంగా సాధించడానికి శాస్త్రీయ దృక్ఫధంతో తగిన కసరత్తు జరుగుతోంది. సుస్థిర వృద్ధి లక్ష్యాలు, సమాజ అభివృద్ధికి పది లక్ష్యాలు, ప్రతిభా కొలమాన సూచికలు, ఉత్తమ పాలనా పద్దతులు, అంతర్జాతీయ కొలమానాలు తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వ శాఖలు ముందుకు వెళ్లుతున్నాయి. 15 శాతం చొప్పున 15 ఏళ్ల పాటు వృద్ధి రేటు  కొనసాగితే రాష్ట్రానికి తిరుగుండదు. ఈ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు, అనుసరిస్తున్న పథకాలు, ఆచరణలో ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను పరిశీలిస్తే భవిష్యత్ లో రాష్ట్రం స్థిరమైన అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments