Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓంకార నాదం వినిపించే సోమేశ్వర లక్ష్మీ నర‌సింహేశ్వరాలయం

వరంగల్లు జిల్లా పాలకుర్తిలో అంటే స్టేషన్ ఘనాపూర్‌కు 23 కిలో మీటర్ల దూరంలో పర్వతాగ్రం మీద స్వయంభు సోమేశ్వర గుహాలయం, శ్రీ లక్ష్మీ నరసింహేశ్వర గుహాలయం ప్రక్కప్రక్కనే ఉండటం విశేషం. ఈ క్షేత్రాన్ని’’ క్షీరాద్రి’’ అంటారు.

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (21:52 IST)
వరంగల్లు జిల్లా పాలకుర్తిలో అంటే స్టేషన్ ఘనాపూర్‌కు 23 కిలో మీటర్ల దూరంలో పర్వతాగ్రం మీద స్వయంభు సోమేశ్వర గుహాలయం, శ్రీ లక్ష్మీ నరసింహేశ్వర గుహాలయం ప్రక్కప్రక్కనే ఉండటం విశేషం. ఈ క్షేత్రాన్ని’’ క్షీరాద్రి’’ అంటారు.
 
’’క్షీరాద్రి శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే ‘’ అని ఇక్కడి నానుడి. పూర్వం ఇది తపో భూమి. అర్థ రాత్రి ఆలయ గుహల నుండి ‘’ఓంకార నాదం’’ వినిపించి తన్మయుల్ని చేయటం మరో విచిత్రం. ఇక్కడి సోమేశ్వరుడిని అర్చిస్తే లక్ష రెట్ల అధిక ఫలితం వస్తుందని అచంచల విశ్వాసం. శివకేశవులకు భేదం లేదని తెలియజెప్పే క్షేత్రం ఇది. నరసింహ స్వామి గుహ నుండి ఉద్భవించే నీటి పాయ కొండ మీది కోనేటి నుంచి అంతర్వాహినిగా ప్రవహించి ఈ గ్రామంలోని చెరువును చేరి ‘’పాలేరు‘’గా మారి చివరికి గోదావరి నదిలో సంగమిస్తుంది.
 
పాలేరు పుట్టిన చోటు కనుక ‘’పాలకుర్తి’’ అయింది. శివ కవులలో ముఖ్యుడైన పాలకుర్తి సోమనాధుడు ఇక్కడి వాడే. శ్రావణ మాసంలో అయిదు రోజులు సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, నరసింహ స్వామికి లక్ష తులసీదళ పూజ, లోకకల్యాణం కోసం ‘’రుద్ర స్వాహా కార పూర్వక శత చండీ యాగం ‘’జరుగుతాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments