Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణదేవాలయం : అమృత్‌సర్

Gulzar Ghouse
అమృత్‌సర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..... 16వ శతాబ్దంలో నాల్గవ గురువు రామ్‌దాస్ ఒక చెరువు ఒడ్డున డేరా వేశారు. అందులోనున్న నీరు చాలా శక్తివంతమైనది. ఆ కారణంగానే అమృత్‌సర్(అమృత్+సర్) అంటే అమృతం యొక్క సరోవరం అని అర్థం.

గురు రామ్‌దాస్ కుమారుడు ఆ సరోవరం మధ్యలోనే ఓ మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్ని స్వర్ణదేవాలయంగా నేడు పిలుస్తున్నారు. ఈ పట్టణంలో ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చే బైసాఖి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ప్రముఖ పర్యాటక కేంద్రం : స్వర్ణదేవాలయం

స్వర్ణదేవాలయం : ఇది సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. దీనిని వారు విష్ణు ఆలయంగాకూడా పిలుస్తారు. ఈ ఆలయ గోపురంపై బంగారు ఆకులతో కప్పినట్లు ఉంటుంది. ఆ ఆకులు భూమి వైపు వంగినట్లుంటాయి. దీని అర్థం ఏంటంటే సిక్కులు ప్రపంచంలోనున్న సమస్యలపట్ల జాగరూకతతో ఉండాలి.

దుర్గియానా ఆలయ ం : ఇది హిందువుల పుణ్యక్షేత్రం, ఈ ఆలయ గోపురంపై బంగారు, వెండి తాపడాలు కలిగి ఉంటాయి.

జలియాన్ వాలా బాగ ్ : 1919వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ స్థానంలో దాదాపు 2000మంది భారతీయులను కాల్చి చంపారు. ప్రస్తుతం ఇక్కడ ఆ సంఘటనకు సాక్షిగా ఈ పార్కు వుంది. బాగ్ అంటే ఉపవనం(తోట).ఈ తోటలో ఆంగ్లేయులను వారిదేశానికి తరిమి కొట్టడానికి బైసాఖి పండుగ సందర్భంగా అందరూ సమావేశమై మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆంగ్లేయాధికారులు జనరల్ డైయ్యర్ తన సైన్యంతో వచ్చి సభలోనున్న చిన్న-పెద్ద, తేడా లేకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపించారు. వారికి గుర్తుగా ఆ పార్క్‌ను వదిలిపెట్టారు.

బాబా అటల్ రాయ్ స్తంభ ం : ఇది గురు హరగోవింద్ సింగ్ యొక్క తొమ్మిది సంవత్సరాల కుమారుని సమాధి కలిగిన స్థలం.

తరన్ తారన్ : అమృత్‌సర్ నుంచి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఈ కొలను ఉంది. ఇందులోనున్న నీటిలో రోగాలను మాయం చేసే గుణం ఉందని అక్కడివారి విశ్వాసం.

రామ తీర్థ ం : రాముని పుత్రులైన లవ, కుశల జన్మస్థానంగా పిలువబడుతుంది.

** విమానాశ్రయంనుంచి ఈ పట్టణం దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణ సమయం 15 నిమిషాలలో పడుతుంది.
** అక్టోబర్ నుంచి మార్చి నెలవరకు ఈ పట్టణాన్ని సందర్శించవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments