గుజరాత్ మోఢేరా సూర్య దేవాలయం

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2011 (19:04 IST)
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా మిమ్మల్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోఢేరా సూర్య దేవాలయానికి తీసుకువెళుతున్నాం. అహ్మదాబాద్‌నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్ సోలంకి- I నిర్మించారు.

క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్ హమద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు.

సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ' అహిల్‌వాడ్ పాటణ్ ' కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది. తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో మూడు సూర్యదేవుని ఆలయాలున్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం, రెండవది జమ్మూలోనున్న మార్తాండ్ ఆలయం మరియు మూడవది మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోఢేరాకు చెందిన సూర్య మందిరం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

Show comments