Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరిన కోర్కెలు తీర్చే మధుర మీనాక్షి అమ్మవారు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2011 (19:16 IST)
దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని రెండో అతి పెద్ద నగరమైన మదురైలో వెలసి ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది.

ఈ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పబడింది. ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు.


ఈ ఆలయంలో పార్వతీ దేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకు ప్రవేశం లేదు. కాంస్యం, నల్లరాతితో సర్వాంగ సుందరంగా మలచిన ఆర్ట్ గ్యాలరీ వీక్షకులకు కనువిందు చేస్తుంది. కులశేఖర పాండ్యుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం తిరుమలై నాయక్ హయాంలో ఆధునికీకరణకు నోచుకుంది.

ఇక మీనాక్షి అమ్మవారు మదురైలో వెలిసిన వైనాన్ని చూస్తే.... తను ఇచ్చిన మాటకోసం భూలోకం చేరిన పార్వతి మదురై రాజుకు కుమార్తెగా జన్మించి మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది.

పరమశివుడు సుందరేశ్వర‌ునిగా భూలోకంలో జన్మించి మదురై వచ్చి మీనాక్షీ అమ్మవారిని వివాహమాడాడడని.. అనంతరం వీరు మదురై రాజ్యాన్ని చాలా ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించారని భక్తులు విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇరువురు ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.

శుక్రవారం రోజుల్లో ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఆలయంలో ఊంజల మండపం వద్ద ఇరువైపులా ఉన్న దేవతలు ప్రతి శుక్రవారం రోజు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా పూజించేవారన్న కథ కూడా ఉంది.

ఎలా చేరుకోవాలి....
రోడ్డు మార్గం ద్వారా.. రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి ప్రతి గంటకోసారి బస్సుసౌకర్యం ఉంది. దీనితో పాటు.. బెంగుళూరు, కంచి వంటి ముఖ్య ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు బస్సు సర్వీసులు ఉన్నాయి. బస్సులో 12 గంటల పాటు ప్రయాణిస్తే మదురై పట్టణానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా... చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌ నుంచి ముదురైకు రైలు సర్వీసులు నడుపుతున్నారు. వీటితోపాటు.. ఉత్తరభారత దేశంలోని కొన్ని ముఖ్య నగరాల నుంచి వారాంతపు రైలు సర్వీసులను భారత రైల్వే శాఖ నడుపుతోంది. రైలు ప్రయాణంలో సుమారు ఏడు గంటల పాటు సాగుతుంది.

విమాన సర్వీసులు... మదురైలో చిన్న పాటి విమానశ్రయం ఉంది. ఇక్కడుకు చెన్నై, ముంబై, బెంగుళూరు, తిరుచ్చి, కొయంబత్తూరుల నుంచి ప్రైవేట్, ప్రభుత్వ విమాన సర్వీసులు తిరుగుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments