Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో వింతైన శివాలయం

ిపిప

Webdunia
గురువారం, 6 మార్చి 2008 (16:58 IST)
FileFILE
శివరాత్రి వంటి పర్వదినాల్లోనే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా భక్తులు శివాలయాలను దర్శిస్తూ తరిస్తుంటారు. శైవ క్షేత్రాల్లో శ్రీశైలం, కాళహస్తి, రామేశ్వరం తదితర ఆలయాలు ఆ తర్వాత కేదార్, బద్రీనాథ్‌లు ప్రసిద్ధి గాంచినవి. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉద్భవించిన ప్రాంతాలైన ద్రాక్షారామం, ర్యాలీ, రామేశ్వరం, ఉజ్జయినీ ఆలయాలు నిత్యం భక్తులతో అలరారుతుంటాయి.

అలాగే రాజస్థాన్‌లోని పర్వత ప్రాంతమైన మౌంట్ అబూకు ఈశాన్య దిశలో ఎనిమిది కి.మీల దూరంలో అచలేశ్వర్ ఆలయం ఉంది. భక్తుల పూజలందుకునేందుకు ఎలాంటి శివలింగం కానీ, ప్రతిమలు కానీ లేకపోవడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయంలోని గర్భగుడిలో ఓ చోట రంధ్రం వంటిది ఉంటుంది. దీనిని పాతాళ మార్గంగా భక్తులు కొలుస్తుంటారు. ఈ మార్గాన్ని చూస్తున్నట్టుగా గోడపై పార్వతీ, విఘ్నేశ్వరుల బొమ్మలుంటాయి.

ఆలయ ఆవరణలో తటాకం ఒకటి ఉంది. పూర్వం ఇందులో శక్తులనిచ్చే నెయ్యి ఉండేదట. ఆ నెయ్యిని తాగేందుకు రాక్షసులు తండోపతండాలుగా వచ్చేవారుట. అలా వచ్చిన రాక్షసులను రాజపుత్రరాజు ధరవర్షదేవ్ సంహరించాడని అక్కడ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. గర్భగుడికి వెలుపల కంచుతో చేసిన నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఆలయానికి సమీపంలో వశిష్ట మహాముని చేసిన యజ్ఞయాగాదుల నుంచి నాలుగు రాజపుత్ర వంశాలు ఆవిర్భావించాయని ప్రతీతి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments