Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయకొండపై కొలువైన గంగమ్మ తల్లి

Webdunia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో నెలవైన ప్రముఖ శక్తి క్షేత్రాలలో బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం ఒకటి. జిల్లాలోని పుంగనూరు తాలుకాలోని చౌడేపల్లి మండలంలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి.. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా, ప్రక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల భక్తుల నుంచి కూడా విశేష నీరాజనాలను అందుకుంటోంది.

మదనపల్లి నుంచి నేరుగా బోయకొండకు వెళ్లేందుకు ఆంధ్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. బస్సులు రద్దీగా ఉన్నట్లయితే... ప్రైవేటు వాహనాలు లెక్కకు మించి అందుబాటులో ఉంటాయి.

అమ్మవారికి ఇష్టమైన ఆదివారం రోజుల్లో.. బోయకొండ క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ రోజుల్లో పొరుగు రాష్ట్రాల నుంచీ కూడా భక్తులు వేల సంఖ్యలో తరలి రావడం వల్ల అమ్మవారి దర్శనం కోసం గంటలతరబడీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది.

సంవత్సరం మొత్తంమీదా సందడిగా ఉండే బోయకొండ ఆలయంలో... ఆయా రోజుల ప్రాశస్త్యాన్ని బట్టి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, నైవేద్య పూజలు, ఉత్సవమూర్తి అలంకరణ, గణపతి హోమం తదితర కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ అమ్మవారికి మొక్కుకున్నట్లయితే, తమ కోరికలు తప్పకుండా ఫలిస్తాయని భక్తుల విశ్వాసం.

భక్తుల పాలిట కల్పవల్లిగా నెలవైన బోయకొండ అమ్మవారికి.. భక్తులు మొక్కు తీర్చుకునేందుకు ముఖ్యంగా కోళ్లు, పొట్టేళ్లు, దున్నపోతులను బలి ఇస్తుంటారు. బలి ఇచ్చిన వాటిని కొండ ప్రాంతంలోనే వంట వండి, అమ్మవారికి నైవేద్యం పెట్టిన తరువాత అక్కడే భోంచేసి వెళ్తుంటారు.

ఇదిలా ఉంటే... బోయకొండ ఆలయం నెలవైఉన్న పుంగనూరుకు "టెంపుల్ టౌన్" అనే ముద్దుపేరు కూడా కలదు. ఎందుకంటే, ఎన్నో పురాతనమైన దేవాలయాలు, బ్రిటీష్ హయాంలోని రాజ్యం పరిపాలించిన దొరల కోట తదితరాలు ఆ ఊర్లో ఉన్నాయి.

అలాగే అమర శిల్పి జక్కన్నకుమారుడు ఒకే ఒక రాత్రిలో చెక్కిన... ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా పుంగనూరులో కలదు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మ జాతర ఎంతో ప్రాముఖ్యం కలిగినదిగా చెప్పుకోవచ్చు. ఈ జాతరకు కర్ణాటక, తమిళనాడుల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుంటారు.

ఇకపోతే... ఈ పుంగనూరు చింతపండు మరియు పశువుల వ్యాపారంలో దేశంలోనే ప్రఖ్యాతి పొందినది కావడం విశేషం. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఈ తాలూకాలో... భక్తుల కొంగుబంగారంగా, కోరిన వరాలిచ్చే తల్లిగా బోయకొండపైన కొలువైన గంగమ్మతల్లి... పుంగనూరు వైభవాన్ని మరింతగా పెంచుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments