Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూరిజం స్పాట్‌గా "శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం"

Webdunia
FILE
గతంలో హైదరాబాద్ నగరం పేరు చెప్పగానే... ఛార్మినార్, గోల్కొండ కోట, మక్కా మసీదు, బిర్లా మందిర్, జూపార్కు మొదలైన ప్రాంతాలన్నీ చూశారా...? అని అడిగేవారు. హైదరాబాద్ చూసేందుకు వెళ్లి వచ్చినవారిని లేదా హైదరాబాదులో నివసిస్తున్న వారిని సాధారణంగా బయటివారు అడిగే ప్రశ్నలు పై విధంగానే ఉండేవి. అయితే మారుతున్న కాలంతోపాటు రాష్ట్ర రాజధాని నగరం రూపురేఖలు, దర్శనీయ ప్రాంతాల ప్రాముఖ్యత సైతం మారుతోంది.

గ్రేటర్ హైదరాబాదుగా రూపాంతరం చెందిన రాజధాని నగరం వెళ్లి వచ్చిన వారిని ఇప్పుడు ఇతర ప్రాంతాల వారు అడిగే ఒకే ఒక పశ్న ఏంటంటే... "గ్రేటర్"లో శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం చూశారా..? అనే..! అంటే... హైదరాబాదు మహానగరంలో చూడదగ్గ ప్రదేశాల్లో మొట్టమొదటి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందినదే వాసవీ కాలనీలో వెలసిన "శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం".

శ్రీలక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో అష్ట లక్ష్మీదేవిలుగా ఆరాధించటం పూర్వకాలంగా వస్తోన్న హిందూ సనాతన ఆచారం. వాసవీ కాలనీలో కొలువైన లక్ష్మీదేవి ధన, ధాన్య, ధైర్య, విజయ, ఐశ్వర్య, సంతాన, సౌభాగ్య, అష్టకామినులుగా.. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ... వారి కొంగు బంగారమై భాసిల్లుతోంది.

వైకుంఠంలో ఉండే శ్రీమహావిష్ణువు చెంతన సర్వలోకేశ్వరి అయిన శ్రీ మహాలక్ష్మీ ఎప్పుడూ విష్ణువును ఎడబాయక ఉంటుంది. ఆమెతోపాటుగా ఆమె అంశా రూపాలైన భూ, నీళా రూపాలు కూడా అక్కడ ఉంటాయి. సకల చరాచరమైన జగత్తంతా ఆమె కటాక్షాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆమె కనురెప్పపాటు కాలంలోనే జగత్తు స్థితిలయలు జరుగుతున్నాయి. సకల జగత్కారణ భూత అయి, పరమేశ్వరి అయిన ఆ మహాలక్ష్మీ త్రిగుణాత్మక ప్రకృతికి అధిష్ఠాన దేవతగా విలసిల్లుతుంటుంది.

సమస్త విద్యల భేదాలు, లక్ష్మీ స్వరూపమే. సమస్త స్త్రీ రూపాలు ఆ తల్లి దేహమే. స్త్రీలలో ఉండే సౌందర్యం, సత్‌ స్వభావం, సదాచారం సౌభాగ్యం, రతి సుఖం ఇవన్నీ ఆ లక్ష్మీ స్వరూపమే. ఆ శ్రీ మహాలక్ష్మీ కటాక్షంలో పది వేలలో ఒక వంతు మాత్రమే పొందిన బ్రహ్మ, రుద్రుడు, దేవేంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు, అగ్నిలాంటివారు నిరంతరం ఐశ్వర్యాన్ని పొందుతున్నారు.
FILE


పాల కడలి నుంచి ఉద్భవించిన శ్రీ మహా విష్ణువు వక్షస్థలంపై కొలువుదీరిన అష్టలక్ష్మీదేవి, భక్తులకు సకల సంపదలను ప్రసాదించి.. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవనం సాగించేలా మహానగర వాసులను కంటికి రెప్పలా కాపాడుతున్న అమ్మవారి దివ్య సన్నిధానాన్ని దర్శించేందుకు అను నిత్యం వేలాదిమంది యాత్రికులు తరలి వస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి ఎనిమిది రూపాలలో దర్శనమిస్తున్న ఈ సుందర ఆలయ శోభ ప్రత్యక్షంగా వీక్షించాల్సిందేగానీ, వర్ణించేందుకు మాటలు సరిపోవు.

వాసవీ కాలనీలో కొలువుదీరిన అష్టలక్ష్మి అమ్మవార్లను దర్శించేందుకు సొంత రాష్ట్రం నుంచేగాక, పొరుగు రాష్ట్రాల నుంచి.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు. ఇక్కడి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు, వారి కోరికలు తీరగానే మళ్లీ ఆలయ సందర్శనార్థం వచ్చి అమ్మవార్ల సన్నిధిలో వాలిపోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మాత్రం ఈ అష్టలక్ష్మీ అమ్మవారి ఆలయ విశేషాన్ని ప్రచారం చేయటంలో చిన్నచూపు చూస్తోందనే ఆరోపణలు భక్తుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిత్యం దేవాలయానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు.

అలాగే... రాష్ట్రం నలుమూలల నుంచి, దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అష్టలక్ష్మీ ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయటంలో కూడా పర్యాటక శాఖ కినుక వహిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా టూరిజం శాఖవారు చొరవ తీసుకుని మరిన్ని ఏర్పాట్లను చేసినట్లయితే, ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉందని ఆ ప్రాంతవాసులు అభిప్రాయపడుతున్నారు.

ఇక చివరిగా... లక్ష్మి, శ్రీ (సిరి), కమల, విద్య, మాత, విష్ణుప్రియ, సతి, పద్మాలయ, పద్మహస్త, పద్మాక్షి, లోకసుందరి, భూతేశ్వరి, నిత్య, సత్య, సర్వగత, శివ, విష్ణుపత్నీ, మహాదేవి, లోకమాత, భూ(భూమి), నీళ, సర్వ ఫలప్రద, రుక్మిణి, సీత, సర్వ, వేదవతి, శుభ, శబి, సరస్వతీ, గౌరీ, స్వాహా, శాంతి, స్వధ, నారాయణి, వరారోహ, విష్ణు నిత్యానపాయిని అనే లక్ష్మీదేవికి చెందిన పుణ్యనామాలను నిత్యం ప్రాతఃకాలంలో పఠించినవారు పాపరహితులవుతారు. ధన, ధాన్య సమృద్ధి కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం ఉంటే కేవలం ఒక్క ధనం మాత్రమే కాదు సకల శక్తులూ సమకూరతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments