Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాక్షిదేవి కొలువైన కాంచీపురం

Webdunia
బుధవారం, 2 ఏప్రియల్ 2008 (14:29 IST)
తమిళనాడు రాజధాని చెన్నైకి సుమారు 75 కి.మీ దూరంలోని కాంచిపురంలో మహిమ గల కామాక్షి అమ్మవారు వెలిసింది. భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన ఏడు పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా కాంచీపురం చరిత్రకెక్కింది. తమిళనాడులోనే ఉన్నప్పటికీ, ఈ ప్రాంత వాసులు వివిధ భాషలు మాట్లాడుతుంటారు. కాంచిపురంలోని ప్రతి వీధిలో ఓ దేవాలయం ఉంటుంది. అందుకే దీనిని 'ది సిటీ ఆఫ్ ఎ థౌజండ్ టెంపుల్స్‌'గా పిలుస్తారు.

కాంచిపురంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ, వీటిలో సందర్శించాల్సిన ముఖ్యమైన దేవాలయాలు శ్రీ కుమరకోటం, శ్రీ అష్టభుజ పెరుమాళ్ ఆలయం, వరదరాజ ఆలయాలు. ఈ కాంచిపురం రెండు ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. వీటి పేర్లు విష్ణు కంచి, శివ కంచి కాగా, ఈ రెండు ప్రాంతాల మధ్యలో కామాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఏకాంబరనాధుని దేవాలయం ఉన్న ప్రాంతాన్ని శివకంచి అని, వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు.

ఈ దేవాలయంలో బంగారు బల్లి, వెండి బల్లులు ఉండడం ప్రజలను ఆకర్షించే మరో అంశంగా ఉంది. వీటిని తాకితే అంత వరకు బల్లులు మీద పడిన దోషాలు పోతాయని ప్రజల నమ్మకం. ఈ ఆలయాలలో చెక్కిన శిల్పకళా నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. కాంచి మఠంలోని శిల్పశాలలో నేర్పించే శిల్ప కళను నేర్చుకునేందుకు విద్యార్థులు, పెద్దలు ఆసక్తి చూపుతుంటారు. జనవరి, ఏప్రిల్, మే నెలల్లో ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు, గరుడోత్సవాలు, రథోత్సవాలను అతి వైభవంగా నిర్వహిస్తారు. పౌర్ణమి రోజుల్లో, శుక్రవారాల్లో కామాక్షి అమ్మవారిని బంగారు రథంలో ఊరేగిస్తారు.

చీరెలంటే గుర్తుకు వచ్చే కాంచీపురం పట్టు చీరెల గురించి వచ్చే వారం తెలుసుకుందాం...

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments