Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ వేంకటేశ్వరుని తిరునామాల ఆకృతిలో జలపాతాలు.. స్వామివారి మహిమేనని..!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2015 (17:32 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరునామం రూపంలో జ్యోతి గరుడ వాహనంపై ప్రజ్వలించడం అందరికీ తెలిసిందే. తాజాగా భారీ వర్షాలకు కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు సైతం శ్రీ వేంకటేశ్వరుని తిరునామాల ఆకృతిలో దర్శనమిస్తూ.. భక్తులను అలరిస్తున్నాయి. ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయంలో ఈ దృశ్యం పర్యాటకులను, భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. అది స్వామివారి మహిమేనని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. 
 
తిరుమల గిరులంటే.. ఏవైపు చూసిన శ్రీహరి రూపమే కనిపిస్తుంది. ఓ వైపు నుంచి చూస్తే తిరుమల గిరులు శ్రీహరిని పోలి పడుకున్నట్లు కనిపిస్తాయి. ఇక కిందకు దిగి వచ్చే రహదారిలో ఒక చోట గరుత్మంతుడి ఆకృతి కనిపిస్తుంది. 
 
శ్రీవారి విగ్రహం ఎంత ఎత్తుంటుందో.. సరిగ్గా అంతే ఎత్తులో సహజసిద్ధ శిలాతోరణం గుడికి వెనుక భాగంలో కనిపిస్తుంది. ఇక నిన్నమొన్నటి భారీ వర్షాలకు కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు సైతం శ్రీవెంకటేశ్వరుని తిరునామాల ఆకృతిలో దర్శనమిస్తూ భక్తులను అలరిస్తుండటం విశేషం.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments