Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల- రూ.10వేలు ఇస్తే.. ఇక శ్రీవారి బ్రేక్ దర్శనం

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో దళారులకు అడ్డుకట్ట వేసే దిశగా కొత్త దర్శనానికి నాంది పలికారు.. టీటీడీ అధికారులు. ఇప్పటికే ఎల్-1, ఎల్-2, ఎల్-3 దర్శనాలను రద్దు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇకపై దాతల నుంచి విరాళాలు తీసుకుని, వారికి ముఖ్యమైన సేవా టికెట్లను అందించాలని నిర్ణయించింది. 
 
ఇందులో భాగంగా, శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించిన టీటీడీ, రూ.10 వేల విరాళం ఇచ్చే భక్తులకు స్వామి సమక్షంలో తీర్థం, శఠారిలతో కూడిన బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పించనుంది. అంతకుమించి విరాళాలు ఇస్తే, ముఖ్యమైన వస్త్రాలంకార, తోమాల, అర్చన వంటి సేవా టికెట్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించాకు. 
 
ఇందులో భాగంగా తొలి దశలో రోజుకు 200 టికెట్లను విడుదల చేస్తూ, ప్రయోగాత్మకంగా పరిశీలించాలని, ఆపై భక్తుల ఆదరణను బట్టి, రోజుకు 1000 టికెట్ల వరకూ కేటాయించాలని భావిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో రోజుకు కనీసం కోటి రూపాయల చొప్పున ఏడాదిలో రూ. 360 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments