Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు: టీటీడీ గుడ్‌న్యూస్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (20:24 IST)
ఆఫ్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 16 నుంచి జారీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తద్వారా సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. రోజుకు పదివేల టిక్కెట్ల చొప్పున తిరుపతిలో ఆఫ్‌‍లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 
 
ఉదయాస్తమాన సేవకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశామని, ఈ నెల 16వ తేదీన ఉదయం 9:30 నిమిషాల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని వెల్లడించారు. 
 
చిన్న పిల్లల ఆసుపత్రికి విరాళాలు ఇచ్చే దాతలకు ఉదయాస్తమాన సేవ దర్శనం కల్పిస్తామని గతంలో తెలియజేశామని గుర్తుచేశారు. దాతలు ముందుకు వచ్చి ఉదయాస్తమాన సేవను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్జిత సేవల పునరుద్ధరణపై మార్చి నెలలో జరగబోయే టీటీడీ బోర్డు మీటింగ్‌లో చర్చిస్తామని టీటీడీ ఈవో తెలిపారు.
 
ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లతో పాటు.. ఉదయాస్తమాన సేవ టికెట్ల బుకింగ్‌ డోనేషన్‌ విండోను ఈ నెల 16న అందుబాటులోకి రానుంది టీటీడీ. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ రెండు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

సెల్ ఫోన్ వాడొద్దని చెప్తే తల్లినే హత్య చేసిన నీట్ విద్యార్థి.. తండ్రికి కూడా తీవ్రగాయాలు

అజ్ఞాతంలో బోరుగడ్డ అనిల్ - విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు!

పెళ్లి వేడుకల్లో విషాదం.. కారు నడిపిన వరడు : ఓ మహిళ మృతి

సీఎం రేవంత్ రెడ్డి ఉమెన్స్ డే గిఫ్ట్ : ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులు

అన్నీ చూడండి

లేటెస్ట్

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. సూపర్ ఫలితాలు

06-03-2025 గురువారం దినఫలితాలు - కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

Dream: శుభశకునాలను సూచించే కలలు ఇవే.. కలలో శ్రీలక్ష్మి కనిపిస్తే..?

అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలి.. ఉచితంగా భూమి ఇవ్వండి: బీఆర్ నాయుడు

తర్వాతి కథనం
Show comments