మైసూర మహారాజ జ్ఞాపకార్థం... 24న తిరుమలలో పల్లవోత్సవం!!

వరుణ్
గురువారం, 18 జులై 2024 (11:01 IST)
తిరుమల శ్రీవారి భక్తుడైన మైసూరు మహారాజ జ్ఞాపకార్ధం ఆయన జన్మించిన ఉత్తరభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈనెల 24వ తేదీన పల్లవోత్సవాన్ని నిర్వహించనుంది. మైసూరు మహారాజ జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి తిరుమలలో ఈ ఉత్సవం జరుగుతోంది. మరోవైపు, తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించి అక్టోబరు నెల కోటాను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైనులో విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు జూలై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లిస్తే లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. 
 
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రద క్షిణ టోకెన్లను, ఆదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలు ఉన్న భక్తులకు ఇచ్చే టోకెన్లను విడుదల చేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల్లోని గదుల కోటాను అందుబాటులో ఉంచుతారు. 
 
ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవారిసేవ, 12 గంటలకు నవనీతసేవ, మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. అక్టోబరు 4 నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో సుప్రభాత సేవ మినహా ఆర్జితసే వలను రద్దు చేశారు. 11, 12 తేదీల్లో సుప్రభాతసేవతో మిగిలిన సేవలను కూడా రద్దు చేశారు. అలాగే అక్టోబరు 3 నుంచి 13వ తేదీ వరకు ఆంగప్రదక్షిణ, వర్చు వల్ సేవా దర్శనం టికెట్లు కూడా రద్దు చేశామని, భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. భక్తులు ఈ టికెట్లు, టోకెన్లను 'టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తితిదే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

తర్వాతి కథనం
Show comments