Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అపచారం.. శ్రీవారికి యు ఆకారంలో నామాలు పెట్టారు!

తిరుమలలో మరో అపచారం జరిగింది. ఇది పెద్ద దుమారాన్నే రేపేలా ఉంది. ప్రతి శుక్రవారం స్వామివారికి నిర్వహించే తోమాల సేవలో ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అపచారం చేశారంటూ జియ్యంగార్లు తిరుమల తిరుపతి దేవస్థానం

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (16:55 IST)
తిరుమలలో మరో అపచారం జరిగింది. ఇది పెద్ద దుమారాన్నే రేపేలా ఉంది. ప్రతి శుక్రవారం స్వామివారికి నిర్వహించే తోమాల సేవలో ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అపచారం చేశారంటూ జియ్యంగార్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు. 
 
తోమాలసేవ తర్వాత స్వామివారికి u, y ఆకారాల్లో కాకుండా మధ్యస్తంగా నామాన్ని పెట్టాలి. అయితే ఆ సాంప్రదాయాన్ని పక్కనబెట్టి u ఆకారంలో స్వామివారికి నామాలను పెట్టారు రమణదీక్షితులు. 
 
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అయితే వడగళై u ఆకారం, తంగలై y ఆకారంలో స్వామివారికి నామాలు పెట్టాల్సి ఉంది. అయితే వైష్ణవ సాంప్రదాయాన్ని మంటగలిపారంటూ జియ్యంగార్లు రమణదీక్షితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రమణదీక్షితులకు నోటీసులు అందించేందుకు టిటిడి సిద్ధమైంది. 
 
దీనిపై రమణ దీక్షితులు స్పందిస్తూ.. శ్రీవేంకటేశ్వరస్వామి వారి నామాలను తాను మార్చలేదన్నారు. 45 ఏళ్లుగా శ్రీవారికి సేవ చేస్తున్నానని... ఇలాంటి పనులు తాను చేయనని స్పష్టం చేశారు. తన కుటుంబాన్ని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని... తమపై లేనిపోని నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే తన మనవడిని గర్భాలయంలోకి తీసుకెళ్లానని చెప్పారు. 
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంలో నైవేద్య విరమణ సమయంలో తన మనవడిని గర్భాలయంలోకి తీసుకెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో రమణ దీక్షితులకు టీటీడీ ఈవో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, శ్రీవారి నామాలను మార్చారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments