Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఆన్‌లైన్‌లో 1,09,092 సేవా టికెట్ల విడుదల.. సుప్రభాతానికి 12476 టిక్కెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో సేవా టికెట్లను విడుదల చేసింది. ప్రతి నెలా మొదటివారంలో తితిదే సేవా టికెట్లను విడుదల చేస్తూ వస్తోంది.

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (13:29 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో సేవా టికెట్లను విడుదల చేసింది. ప్రతి నెలా మొదటివారంలో తితిదే సేవా టికెట్లను విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఈసారి సేవా టికెట్ల విషయానికొస్తే 2 నెలలకు కలిపి ఒకేసారి సేవా టికెట్లను విడుదల చేసింది. మొత్తం 1,09,092 టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
 
సుప్రభాతం 12,476, తోమాల, అర్చన 260, విశేషపూజ -3000, అష్టదళ పాదపద్మారాధనసేవ - 140, నిజపాద దర్శనం - 2952, కళ్యాణోత్సవం 21,369, ఊంజల్‌ సేవ - 5,700, ఆర్జిత బ్రహ్మోత్సవం - 12,255, వసంతోత్సవం - 24,080, సహస్ర దీపాలంకరణ - 26,600 సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది. 
 
ఇంత పెద్ద మొత్తంలో ఆన్ లైన్‌ సేవా టికెట్లను తితిదే విడుదల చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఇంటర్‌నెట్‌ సెంటర్ల వద్ద కొంతమంది దళారీలు టికెట్లను బుక్‌ చేసే ప్రయత్నం ప్రారంభించారు. ఆధార్‌ కార్డు ఉన్న భక్తులు నేరుగా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకొని సేవా టికెట్లను పొందే అవకాశాన్ని తితిదే కల్పిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments