శ్రీవారి భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త.. ఏంటది..?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:52 IST)
శ్రీవారి భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఓ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతికి రిజర్వేషన్ చేయించుకునే సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం కూడా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ టిక్కెట్ ధర రూ.300. ఈ టిక్కెట్‌తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. 
 
తిరుపతికి వెళ్లే దూరప్రాంత సర్వీసులకు ఈ సదుపాయం వర్తిస్తుందని, ప్రయాణ చార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి ఉదయం 11 గంటల స్లాట్‌లో, ఆపై సాయంత్రం 4 గంటల స్లాట్‌లో టికెట్లను ఎంచుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రోజుకు 1000 టిక్కెట్లను జారీచేస్తారు. 
 
ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్‌లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పైగా, వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పల్టీలు కొడుతూ కూలిపోయిన అజిత్ పవార్ ఎక్కిన విమానం (video)

AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం

Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్

Ajit Pawar, అజిత్‌ మరణం ప్రమాదమే రాజకీయం చేయవద్దు: శరద్ పవార్

RTC Conductor: ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

అన్నవరం ప్రసాదంలో నత్త.. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు

24-01-2026 శనివారం ఫలితాలు - మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

తర్వాతి కథనం
Show comments