తితిదే సేవల కోసం కొత్త యాప్‌: 30 నిమిషాల్లోనే 20వేలకు పైగా టిక్కెట్లు!

కలియుగ వైకుంఠం, తిరుమల తిరుపతి దేవస్థానంలో అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకునేందుకు తితిదే తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టీటీడీ సేవలను మరింత విస్తృతం చేసేందుకు కొత్తగా మొబైల్ యాప్‌ను అందుబాటులోక

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (10:11 IST)
కలియుగ వైకుంఠం, తిరుమల తిరుపతి దేవస్థానంలో అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకునేందుకు తితిదే తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టీటీడీ సేవలను మరింత విస్తృతం చేసేందుకు కొత్తగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది.

గతంలో టికెట్లను పొందాలంటే ఆన్‌లైన్‌లోనూ గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తితిదే ప్రవేశపెట్టిన యాప్‌లో సేవా టిక్కెట్లు, గదుల టిక్కెట్లతో పాటు తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే సౌకర్యం ఉంటుంది. 
 
ఇంకా ఈ సేవలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు వీలుగా ఇటీవల పోర్టల్ కూడా ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పోర్టల్‌ ద్వారా ఇటీవల కేవలం 30 నిమిషాల్లోనే 20వేలకుపైగా టికెట్లను భక్తులు పొందగలిగినట్లు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం వివిధ విభాగాల ద్వారా భక్తులకు అందిస్తున్న మౌలిక సౌకర్యాలకు సంబంధించిన బిల్లులు, ఇన్‌వాయిస్‌లు అన్నీ చేతిరాతల ద్వారా సాగుతున్నాయి. ఇందులో అవకతవకలు తొంగిచూస్తున్నాయి. దీనికి బ్రేక్ వేసేందుకు కొత్తగా ఎంటర్‌ప్రైస్‌ రీసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ)ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడు నెలల్లో దీన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

అన్నీ చూడండి

లేటెస్ట్

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

తర్వాతి కథనం
Show comments