తితిదే అద్దె గదుల బుకింగ్‌లో కొత్త నిబంధనలు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (15:42 IST)
తిరుమలలో అద్దె గదుల కేటాయింపులో ఇప్పటివరకు ఉన్న నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మార్పులు చేసింది. ఇకపై అద్దె గదుల బుకింగ్‌లో క్యాష్ ఆన్ డిపాజిట్ విధానాన్ని తక్షణం అమల్లోకి తెస్తున్నట్టు తెలిపింది. 
 
ఇందులోభాగంగా ఆన్‌లైన్ మాధ్యమంలో గదిని బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుందని పేర్కొంది. గదిని ఖాళీ చేసిన తర్వాత ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలియజేసింది.
 
ఇకపోతే, ఆఫ్‌లైన్‌లో అంటే, తిరుమలకు వచ్చి అక్కడి కౌంటర్లలో గదులను బుక్ చేసుకునే భక్తులకు, ఈ నెలాఖరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని, భక్తులు గమనించాలని కోరింది. 
 
కాగా, గతంలో తిరుమలలో అద్దె గదుల బుకింగ్‌నకు ఇదే విధానం అమలులో ఉండేది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ రోజు గదికి అదే రోజు అద్దె చెల్లించే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు తిరిగి పాత విధానంలోకి తీసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? సుప్రీంకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments