2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2016 (12:06 IST)
తిరుమలలో రద్దీ మోస్తారుగా కనిపిస్తోంది. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే పరీక్షలు ఉండడంతో భక్తుల రద్దీ తగ్గిందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. వారాంతంలో శనివారం ఒక్కరోజే లక్షమందికిపైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. శనివారం స్వామివారికి ఇష్టమైన రోజు. ఆ రోజు శ్రీవారిని దర్శించుకుంటే ఎంతోమంచిదని భక్తుల నమ్మకం. 
 
దీంతో ప్రతి శనివారం భక్తులు తిరుమలకు వస్తారు. తమిళనాడు రాష్ట్రం నుంచే ఎక్కువగా భక్తులు వస్తుంటారు. శనివారం రద్దీ లేకపోవడం టిటిడి అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శుక్రవారం శ్రీవారిని 57,133మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి రెండు గంటల్లో స్వామిదర్శనం లభిస్తోంది. 
 
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి రెండుగంటల్లో స్వామిదర్శనం పూర్తవుతోంది. శుక్రవారం శ్రీవారిని హుండీ ఆదాయం 2 కోట్ల 32 లక్షల రూపాయలు ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

Show comments