ఈ నెల 31వ తేదీన వీఐపీ దర్శనాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 27 అక్టోబరు 2024 (17:50 IST)
ఈ నెల 31వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. దీపావళి ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీపావళి రోజున సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించరు. అయితే, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అదేసమయంలో ఈ నెల 30వ తేదీన సిఫారసు లేఖలను స్వీకరించబోనని స్పష్టం చేశారు. 
 
విజయవాడ - విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు 
 
విజయవాడ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. 
 
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుతుంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది. 
 
అలాగే, ఇండిగో విమాన సర్వీసు రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ - విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో వుంటుంది.. రేవంత్ రెడ్డి

Jubilee Hills Assembly bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం

అనుమానం పెనుభూతమైంది.. భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేసిన భర్త

చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

తల్లిని - తమ్ముడిని కత్తితో నరికి చంపిన మతిస్థిమితం లేని వ్య

అన్నీ చూడండి

లేటెస్ట్

06-11-2025 బుధవారం ఫలితాలు - ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి

కార్తీక పౌర్ణమి నాడు కాశీ విశ్వనాథుని సన్నిధిలో గంగా నదిలో వెలుగుల దీపాలు

శివాష్టకం విన్నా, పఠించినా కలిగే ఫలితాలు

సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా?

05-11-2025 బుధవారం ఫలితాలు - మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు

తర్వాతి కథనం
Show comments