Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో లడ్డూల కొరత.. 25 వేల కోటా నుంచి 15 వేలకు తగ్గింపు

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2015 (12:13 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తేరుకోలేని షాకిచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండా లడ్డూల్లో కోత విధించింది. దీంతో శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులకు లడ్డూల కొరత ఏర్పడింది. దీనిపై వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. 
 
భక్తులకు అందించే లడ్డూల సంఖ్యను కుదించింది. దీనిపై సమాచారం లేని వెంకన్న భక్తులు తక్కువ సంఖ్యలో ఇస్తున్న లడ్డూలపై అక్కడి సిబ్బందిని నిలదీశారు. లడ్డూల కోటా తగ్గిందని చెప్పిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా లడ్డూల కోటాను ఎలా తగ్గిస్తారని భక్తులు మండిపడ్డారు. దీంతో లడ్డూ కౌంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. 
 
ఈ కోటాను 25 వేల నుంచి 15 వేలకు తగ్గించారు. ఈనెల 17వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల కోసం లడ్డూలను నిల్వ చేసే ప్రక్రియలో భాగంగా లడ్డూల కోటాను తగ్గించినట్టు ఆలయ అధికారులు చెపుతున్నారు. అయితే, అధికారుల వివరణతో భక్తులు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. 

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి

మే 22 నుంచి 24 వరకు తిరుచానూరు వార్షిక వసంతోత్సవం

22-05-2024 బుధవారం దినఫలాలు - కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి...

బుద్ధ పౌర్ణమి.. వైశాఖ పౌర్ణమి పూజ.. దానాలు.. ఇవి కొంటే?

నరసింహ జయంతి : పంచామృతంతో అభిషేకం.. పానకం, నేతి దీపం..

21-05-202 మంగళవారం దినఫలాలు - పెంపుడు జంతువుల పట్ల మెళకువ అవసరం...

Show comments