సప్తగిరులపై బ్రహ్మోత్సవం శోభ - బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విష్వక్సేనుడి వైభవంగా మాఢా వీధుల్లో ఊరేగించారు. వందలాదిమంది భక్తుల గోవిందనామస్మరణల మధ్య వైభవోపేతంగగా విష్వక

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:57 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విష్వక్సేనుడి వైభవంగా మాఢా వీధుల్లో ఊరేగించారు. వందలాదిమంది భక్తుల గోవిందనామస్మరణల మధ్య వైభవోపేతంగగా విష్వక్సేనుడి విహరించారు. సప్తగిరులు మొత్తం బ్రహ్మోత్సవం శోభను సంతరించుకుంది. భక్తుల మనసుల్లో ఆధ్మాత్మిక భావనలు వెల్లివిరుస్తున్నాయి. మంగళవారం రాష్ట్రప్రభుత్వం తరపున శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 
 
కాగా, ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. దక్షిణ మాడ వీధిలో ప్రత్యేక గేటు ద్వారా వీరిని దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన భక్తుల మాదిరిగా వీరు చుట్టూ తిరిగి రావాల్సిన పని లేకుండా గంటలోనే స్వామి దర్శనం చేసుకునేందుకు వీలుంది. ఉదయం 10 గంటలకు ఓసారి, మధ్యాహ్నం 3 గంటలకు ఓ సారి భక్తులను ఇక్కడ అనుమతిస్తారు. దానికి రెండు గంటల ముందుగానే వైకల్య సర్టిఫికెట్, వృద్ధాప్యాన్ని నిర్ధారించే పుట్టిన తేదీ ధ్రువీకరణలతో భక్తులు చేరుకోవాల్సి ఉంటుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఛీ.. ఛీ.. యాక్, ఈ బిస్కెట్లు ఎట్లా తింటున్నారు, నేలకేసి కొడుతున్న కోతులు, వీడియో

పాలకొల్లు మత్య్సకారుడి వలలో రూ 2 లక్షల చేప, వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ అసెంబ్లీ స్పీచ్.. ఆ సైగ..? (video)

సాయి కృష్ణ కేసులో పురోగతి.. కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు.. అసలేం జరిగింది?

మాజీ మున్సిపల్ చైర్మన్ మెడలో చెప్పుల దండ వేసి కుళ్లిన కోడిగుడ్లతో కొట్టారు, ఎందుకు? వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

తర్వాతి కథనం
Show comments