Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం..?

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గింది. శ్రీవారి వెంకన్నకు భక్తులు కాసుల వర్షం కురిపిస్తారు. అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా, ఆన్ లైన్ విరాళాలు పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం తగ్గుమఖం పట్

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (13:14 IST)
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గింది. శ్రీవారి వెంకన్నకు భక్తులు కాసుల వర్షం కురిపిస్తారు. అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా, ఆన్ లైన్ విరాళాలు పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం తగ్గుమఖం పట్టిందని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. 2017లో హుండీ ఆదాయ వివ‌రాల‌ను ఓసారి పరిశీలిస్తే.. 2016 కంటే 2017 హుండీ ఆదాయం త‌గ్గింద‌ని తెలిపింది.
 
ఇందుకు ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన నోట్ల ర‌ద్దేనని తెలుస్తోంది. ఏడాది మొత్తానికి రూ. 995.89 కోట్లు హుండీ ఆదాయం వ‌చ్చింది. ఈ  ఆదాయం.. 2016 ఆదాయం రూ. 1046.28 కోట్లతో పోల్చితే దాదాపు రూ. 50 కోట్లు త‌క్కువని తితిదే వెల్లడించింది. 
 
నోట్ల ర‌ద్దు త‌ర్వాత ర‌ద్దైన నోట్ల‌ను హుండీలో వేయ‌డం వ‌ల్ల ఆదాయం తగ్గిందని టీటీడీ అధికారుల అంచనా. ఇంకా ఆన్‌లైన్‌లోనే వెంకన్నకు భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలు పెరిగిపోతున్నాయని వారు అన్నారు. జీఎస్టీ ఎఫెక్ట్ కూడా హుండీ ఆదాయంపై పడిందని తితిదే అధికారులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

తర్వాతి కథనం
Show comments