Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (16:12 IST)
తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. 
 
ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీఅమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువు దిర్చి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారి మూలమూర్తిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. 
 
ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు లక్ష కుంకుమార్చన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ఆ తరువాత సాయంత్రం 6.30 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
 ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonam Raghuvanshi: రాజా రఘువంశీ హత్య కేసు.. 790 పేజీల ఛార్జిషీట్‌

13న అల్పపీడనం... నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసి వాగులో పడేసిన కిరాతక కుమారుడు

విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభం

కవిత దొరసాని కాదని మా పార్టీలో చేరి నిరూపించుకోవాలి : కేఏ పాల్ ఆహ్వానం

అన్నీ చూడండి

లేటెస్ట్

05-09-2025 శుక్రవారం ఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు.. మీ కష్టం వృధా కాదు...

Pitru Paksha: ఆ మూడు రుణాల్లో పితృరుణం తీర్చుకోవాల్సిందే.. మహాలయ పక్షం ప్రారంభం ఎప్పుడు?

Anant Chaturdashi 2025: అనంత చతుర్దశి వ్రతానికి... గణేష నిమజ్జనానికి సంబంధం ఏంటంటే?

Ganesh Nimmajanam: గణేష్ నిమ్మజ్జనం సమయంలో ఈ తప్పులు చేయవద్దు

మరింత మెరుగైన శ్రీవారి సేవల కోసం ట్రైనీ వాలంటీర్లు : తితిదే నిర్ణయం

తర్వాతి కథనం
Show comments