తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Webdunia
ఆదివారం, 1 మే 2016 (18:52 IST)
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతం కావడంతో శనివారం నుంచి భక్తుల రద్దీ కనిపిస్తోంది. తిరుమల సర్వదర్శనం కంపార్టుమెంట్లతో పాటు కాలినడక భక్తుల కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. సర్వదర్శనం కోసం 15 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలకు పైగా దర్శన సమయం పడుతోంది. 
 
తలనీలాల ఇచ్చే కళ్యాణకట్ట వద్ద కూడా ఇదే పరిస్థితి. తలనీలాలు ఇవ్వడానికి 5 గంటల సమయం పడుతోంది. కళ్యాణకట్ట వద్దనున్న క్యూలైన్లు కూడా భక్తులతో నిండిపోయాయి. గదులు ఖాళీ లేవంటూ టిటిడి ఆన్‌లైన్‌ సర్వర్లలో దర్శనమిస్తున్నాయి. రోడ్లపైనే భక్తులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న శ్రీవారిని 82,347మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం కోటి 74లక్షల రూపాయలు లభించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

తర్వాతి కథనం
Show comments