తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శన సముదాయం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2016 (12:43 IST)
శ్రీవారి భక్తుల కోసం సిద్ధం చేసిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన సముదాయాన్ని భక్తుల కోసం శుక్రవారం నుంచి ప్రారంభించారు. వైకుంఠం-1కు అతిసమీపంలో ఏటీసీ కార్ల పార్కింగ్‌ల వద్ద సముదాయాలను తితిదే ఏర్పాటుచేసింది. ఈ సముదాయాలను తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, కార్యనిర్వహణాధికారి సాంబశివరావులు ప్రారంభించారు. 
 
ఈ లైన్ల ద్వారా వెళ్లే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా స్వామి చెంతకు చేరుకోవచ్చు. గతంలో శంఖుమిట్ట నుంచి భక్తులను ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతించేవారు. అయితే శంఖుమిట్ట నుంచి దర్శనానికి వెళ్లేందుకు చాలా దూరంగా ఉంటోందని భక్తులు తితిదే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తితిదే నూతన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 
 
ఉగాది పర్వదినం రోజునే ఈ సముదాయాలను ఏర్పాటు చేయడంపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతి దగ్గరగా త్వరితగతిన భక్తులు దర్శనం చేసుకునే వీలుంటుందని తితిదే ఛైర్మన్‌ చదలవాడ మీడియాకు తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కవితకు అలా చెక్ పెట్టిన నారా లోకేష్.. ఏంటి సంగతి?

సజ్జనార్ ఐపీఎస్ షేర్ చేసిన ద్విచక్ర వాహన ప్రమాద వీడియో చూస్తే జన్మలో హెల్మెట్ లేకుండా వెళ్లరు

నీ కడుపులో వున్నది నా బిడ్డ కాదు, డీఎన్ఎ టెస్ట్ చేపిస్తా: భర్త వేధింపులకు గర్భిణి ఆత్మహత్య

కొత్తగా పెళ్లైంది.. కొండపైనున్న ఆలయానికి వెళ్లారు.. కోతుల గుంపు.. భయంతో నవవధువు మృతి

రాజ్ ఘాట్ వంతెనపై నుంచి గంగలో దూకేందుకు మహిళ, కాపాడిన యువకుడు, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments